Telugu Flash News

Train : రైలుకు ఎన్ని గేర్లు ఉంటాయి? ఆసక్తికర అంశాలివే!

indian railways

How many gears does an Indian train have : సాధారణంగా బైక్‌కు నాలుగు లేదా ఐదు గేర్లు ఉంటాయి. కారుకు ఐదు గేర్లు, రివర్స్‌ గేర్‌ ఉంటాయి. చాలా మందికి రైలుకు ఎన్ని గేర్లు ఉంటాయనే విషయం తెలియదు. తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటుంది.  ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఇండియన్‌ రైల్వేస్‌ ఒకటి. రోజూ వేలాది కిలోమీటర్లు ప్రయాణించి లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తోంది భారతీయ రైల్వే. దేశ వ్యాప్తంగా 68 వేల కిలోమీటర్ల పొడవైన రైల్వే లైన్లు ఉన్నాయి. రోజూ 13 వేలకుపైగా సర్వీసులు నడుస్తున్నాయి.

1. సాధారణ వాహనాల మాదిరిగానే రైళ్లకు కూడా గేర్లుంటాయి.

2. డీజిల్‌ ఇంజిన్‌కు ఉండే గేరును నాచ్‌ (గేర్‌) అని పిలుస్తారు. ఇందులో 8 నాచ్‌లు ఉంటాయి.

3. వేగాన్ని పెంచుకొనేందుకు ఒక్కో నాచ్‌ను వేస్తుంటారు.

4. ఎనిమిదో నాచ్‌ వేస్తే టాప్‌గేర్‌లో రైలు హై స్పీడ్‌ వెళ్తుంది. వేగాన్ని తగ్గించడానికి ఒక్కో నాచ్‌ వేయాలి.

5. ఎలక్ట్రిక్‌ రైళ్లలో నాచ్‌ వ్యవస్థ ఉండదు. అంతా ఆటోమేటిక్‌.

Also Read :

Shriya Saran Latest hot Instagram photos 2023

barley water benefits : బార్లీ నీరు తాగితే బోలెడు లాభాలు..

 

Exit mobile version