coriander benefits : వంటింట్లో ఉండేవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంటాయి. దినుసుల్లో మనకు ప్రయోజనకరంగా ఉండే వాటిలో ధనియాలు.. ఒకటి. ధనియాలు ప్రతిఒక్కరి ఇంట్లో ఉంటాయి. వీటిల్లో విటమిన్ ఎ, సీ, కె పుష్కలంగా ఉన్నందున వీటిని ఏ రకంగానైన తీసుకోవడం మంచిది. ధనియాలు వేసి మరగబెట్టి తాగొచ్చు లేదంటే పౌడర్‌ను నీటిలో కలుపుకోని కూడా తీసుకోవచ్చు. కూరలలో కూడా వేసుకోవచ్చు. మొత్తంగా ధనియాలని ఎలా తీసుకున్న కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
ధనియాలతో ఎన్నో లాభాలు..
చర్మ సమస్యలను తగ్గించడంలో ధనియాలు బాగా పనిచేస్తాయనే విషయం తెలిసిందే. గజ్జి, చర్మంపై దురదలు, దద్దుర్లు, వాపులను తగ్గించడంలో ధనియాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.. నోట్లో పుండ్లు, పొక్కులను కూడా ఇవి తగ్గిస్తాయి. ధనియాల్లో లినోలీయిక్ యాసిడ్ ఉంటుంది, ఇది ఇరిటేషన్ సమస్య నుండి కాపాడుతుంది. ఇక ధనియాలని నిత్యం తీసుకుంటే చక్కెర స్థాయి తగ్గుతుంది. ధనియాల పొడిని రోజూ తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఒత్తిడి, ఇతర పలు కారణాల వల్ల చాలా మందిలో జుట్టు రాలడం జరుగుతుంది. ధనియాలు ఈ సమస్యని తగ్గిస్తాయి.
ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అంతే కాదు ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ధనియాల వలన మలబద్దకం తగ్గుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలను తగ్గడమే కాకుండా ప్రేగులు కూడా శుబ్రం అవుతాయి. యునాని వైద్యంలో ధనియాలు ను హేమోరాయిడ్స్, లెగ్ అల్సర్, తలనొప్పి మరియు పీడకలలకు కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. మీజిల్స్, డయాబెటిస్, గ్యాస్ట్రోఎంటెరిటిస్ మరియు బెల్చింగ్ వంటి సమస్యలకు కొత్తిమీర ఆకులను చైనీస్ మెడిసిన్‌లో ఉపయోగిస్తారు. ధనియాలను కొద్దిగా వేయించి పొడి చేసి నిల్వ చేసుకుంటే ఆ పొడిని రోజూ 2-4 గ్రాముల మోతాదులో తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది.