pepper for weight loss : పురాతన కాలం నుండి భారతీయులు మిరియాలను వంటలలో ఉపయోగిస్తున్నారు. ఇవి వంటకాలకు మంచి రుచిని అందిస్తాయి. కారంగా కావాలనుకునే వారు మిరపకాయలకు బదులుగా మిరియాలను ఉపయోగించవచ్చు. మిరియాలలో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా వాటితో అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని మిరియాలను తీసుకుని రెండు తమలపాకుల్లో వేసి నిత్యం నమిలి తింటే అధిక బరువు త్వరగా తగ్గిపోతుంది.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ మిరియాల పొడి కలిపి రోజూ ఉదయాన్నే పరగడుపున తాగితే అధిక బరువు తగ్గుతారు.
మార్కెట్‌లో లభించే నల్ల మిరియాల నూనెను తీసుకుని ఒక గ్లాసు నీళ్లలో ఒక చుక్క నూనె కలుపుకుని రోజూ ఉదయాన్నే పరగడుపున తాగితే శరీరంలోని కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతుంది.
అల్లం రసం, తులసి ఆకులు, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి కలిపి చేసిన గ్రీన్ టీ తాగితే అధిక బరువు త్వరగా తగ్గుతారు.
అరకప్పు పుచ్చకాయ, పైనాపిల్ రసాలను తీసుకుని అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం, అర టీస్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని రోజూ ఉదయాన్నే తాగితే అధిక బరువు త్వరగా తగ్గుతుంది.
also read :
Dengue fever : డెంగ్యూ జ్వరం అంటే ఏంటి ? లక్షణాలు, నివారణ తెలుసుకుందాం !
carrot orange juice : క్యారెట్ ఆరెంజ్ జ్యూస్‌ని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.. సూపర్ గా ఉంటుంది !
Best morning routine : ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేయండి !!