Do this to make the gas cylinder last longer : ఇంట్లో వంట వండేటప్పుడు గ్యాస్ స్టౌ వాడటం చాలా మంది చేస్తుంటారు. ఓ వైపు గ్యాస్ ధర మాత్రం పెరిగిపోతూనే ఉంది. పెరిగిపోతున్న ధర కారణంగా గ్యాస్‌ను కాస్త జాగ్రత్తగా వాడుకోవడం ముఖ్యం. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎల్పీజీ గ్యాస్‌ను ఎక్కువగా వాడడం వల్ల వాతావరణంలోకి గ్రీన్ హౌస్ వాయువులు రిలీజ్ అవుతాయి.
ఎక్కువగా వాడకుండా, తక్కువ సమయంలోనే వంటను పూర్తి చేసుకుంటే ఈ వాయువుల విడుదలను అరికట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రోజులో ఒకేసారి ఎక్కువ మొత్తంలో కూర వండుకోవడం ఉత్తమం. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. ఇలా మూడు సార్లు వండడం వల్ల గ్యాస్ ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుంది.
మధ్యాహ్నం భోజనం చేయడానికి గంట ముందు వండుకుంటే, అదే కూర మధ్యాహ్నం, రాత్రికి కూడా తినేయొచ్చు. గిన్నెలో కాకుండా ప్రెషర్ కుక్కర్‌ను ఎక్కువగా వాడితే మంచిది. ప్రెషర్ కుక్కర్ తక్కువ టైమ్‌లోనే ఫుడ్‌ను ఉడికిస్తుంది. గ్యాస్ ఆదా అవుతుంది. బర్నర్‌ను తరచూ శుభ్రపరుస్తూ ఉండాలి. ఇలా చేస్తే అది త్వరగా వేడెక్కుతుంది. వంట తొందరగా పూర్తవుతుంది.
వంట పూర్తయ్యే 5 నిమిషాల ముందే బర్నర్ ఆపేయాలి. గిన్నె మీద మూత తీయరాదు. లోపల ఉన్న వేడి ఆ మిగతా వంటను కంప్లీట్ చేస్తుంది. ఏ గిన్నెలో వండుతున్నా మూత పెట్టే ఉంచాలి. ఇలా చేస్తే లోపల ఉన్న వేడి ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది. వంటగదిలోని లైట్లను ఆఫ్ చేయాలి. దీంతో శక్తి ఆదా అవుతుంది.
also read :
Sukumar: విరూపాక్ష డైరెక్టర్ గురించి సుకుమార్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
Akhil: ఫ్యామిలీ అన్నాక గొడవలు రావా అంటూ అఖిల్ కామెంట్స్.. ఎందుకిలా అన్నాడు..!