Homenationaltamilnadu news : డీఎంకేకు ఉగ్రవాదులతో లింక్ ఉందా? డీఎంకే నేతలను అరెస్ట్ చేయాలి..

tamilnadu news : డీఎంకేకు ఉగ్రవాదులతో లింక్ ఉందా? డీఎంకే నేతలను అరెస్ట్ చేయాలి..

Telugu Flash News

tamilnadu news : తమిళనాడు గవర్నర్ ని హత్య చేయడానికి ఉగ్రవాదిని పంపిస్తా అంటూ డీఎంకే ప్రతినిధి శివాజీ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.దీంతో తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి మరియు డీఎంకే శివాజీ కృష్ణ మూర్తిల మధ్య వివాధం మరింత వేడెక్కింది.

వివరాల్లోకి వెళ్తే ఈ నెల 9న అసెంబ్లీలో తమిళనాడు గవర్నర్ చేసిన ప్రసంగం వార్తలకెక్కింది.ఆ ప్రసంగంలో కొంత భాగాన్ని పక్కన పెట్టి,ఉన్నవి లేనివి కూడా ప్రస్తావించినట్టు డీఎంకే ఆరోపించింది.ఆయనకు వ్యతిరేకంగా సీఎం స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ పరిణామాల మధ్య ఆర్ఎన్ రవి సభ నుంచి వాకౌట్ చేయగా.. డీఎంకే,బీజీపీ మధ్య మాటల తూటాలు పేలాయి.

ఇటీవల తమిళనాడులో ఓ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో డీఎంకే ప్రతినిద శివాజీ కృష్ణమూర్తి కూడా పాల్గొన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన గవర్నర్ పై వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.అంబేద్కర్ పేరు ఎత్తడం ఇష్టం లేకపోతే కశ్మీర్ వెళ్లిపోవాలని అన్నారు.

గవర్నర్ ను తిట్టొద్దని సీఎం చెబుతున్నారని,అసెంబ్లీలో సరిగ్గా ప్రసంగం చేసి ఉంటే గవర్నర్ కాళ్ల వద్ద పువ్వులు వేసేవాడినని, చేతులు జోడించి దండం పెట్టేవాడినని అన్నారు. ఆయనకి అంబేద్కర్ పేరును చెప్పేందుకు ఇష్టపడలేదని, అలాంటి వ్యక్తిని చెప్పుతో కొట్టే హక్కు నాకు లేదా అని అంటూ వ్యాఖ్యానించారు. అంబేద్కర్ పేరును ప్రస్తావించడం ఇష్టం లేకపోతే కశ్మీర్ వెళ్లిపోవాలని అన్నారు.

గవర్నర్ ను కాల్చి చంపేందుకు అక్కడికి ఉగ్రవాదిని పంపిస్తానని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇది ఇలా ఉండగా మరోవైపు ఈ వ్యాఖ్యలను బీజీపీ నేతలు తీవ్రస్థాయిలో ఖండించారు.

“గవ్నరర్ ను కశ్మీర్ కు పంపిస్తానని, అక్కడికి ఉగ్రవాదులను పంపించి హత్య చేయిస్తానని డీఎంకే ప్రతినిధి అంటున్నారు. డీఎంకేకు ఉగ్రవాదులతో లింక్ ఉందా? అని పోలీసులు దర్యాప్తు చేపట్టాలి. నీచమైన పదజాలంతో గవర్నరు పై వ్యాఖ్యలు చేశారు శివాజీ కృష్ణమూర్తి. ఇవన్నీ.. సీఎం ఎంకే స్టాలిన్ ఆశిస్సులతోనే జరుగుతున్నట్టు అనిపిస్తోంది” అంటూ బీజేపీ నేత నారాయణ్ తిరుపతి మండిపడ్డారు.

-Advertisement-

డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తితో పాటు మరో నాయకుడు ఆర్ ఎస్ భారతీని కూడా గూండా చట్టం కింద అరెస్ట్ చేయాలని అన్నారు.

అదే విధంగా తమిళనాడు పోలీసులకు ధైర్యం ఉంటే డీఎంకే నేతలను అరెస్ట్ చేయాలని,గూండా చట్టం కింద వారిద్దరిని ఏడాది పాటు జైలులో పెట్టాలని తిరుపతి డిమాండ్ చేశారు.

also read news:

BCCI:టీమిండియా జ‌ట్టులో జడేజాకి ఛాన్స్ లేన‌ట్టేనా… బీసీసీకి పెద్ద త‌ల‌నొప్పులు…!

Samantha: స‌మంత ఒంట‌రిత‌నంతో ఆవేద‌న చెందుతుందా… ఆమెకు తోడు వారిద్ద‌రేనా..!

varasudu telugu movie review : ‘వారసుడు’ తెలుగు మూవీ రివ్యూ

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News