HomecinemaLegendary director K Viswanath passed away : శంక‌రాభ‌ర‌ణం రిలీజ్ రోజే క‌న్నుమూసిన లెజండ‌రీ డైరెక్ట‌ర్ విశ్వ‌నాథ్

Legendary director K Viswanath passed away : శంక‌రాభ‌ర‌ణం రిలీజ్ రోజే క‌న్నుమూసిన లెజండ‌రీ డైరెక్ట‌ర్ విశ్వ‌నాథ్

Telugu Flash News

Legendary director K Viswanath passed away : ఇటీవ‌ల సినీ ఇండ‌స్ట్రీలో దిగ్గ‌జాలు ఒక్కొక్క‌రుగా క‌న్నుమూస్తున్న విష‌యం తెలిసిందే. కృష్ణంరాజు, కృష్ణ‌, కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, చ‌ల‌ప‌తి రావు ఇలా ప‌లువురు ప్రముఖులు వ‌రుస‌గా మృత్యువాత ప‌డ‌గా, నిన్న రాత్రి క‌ళా త‌ప‌స్వి కె విశ్వ‌నాథ్ క‌న్నుమూసారు. సరిగ్గా 43 ఏళ్ల క్రితం 1980 ఫిబ్రవరి 2న ‘శంకరాభరణం’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రోజున కె.విశ్వనాథ్(92) కన్నుమూయ‌డం విశేషంగా చెప్పాలి. విశ్వ‌నాథ్ కెరీర్ ని అద్భుతమైన స్టేజీకి తీసుకెళ్లింది శంక‌రాభ‌ర‌ణం చిత్రం.

విశ్వ‌నాథ్‌కి ‘కళాతపస్వి’ అన్న పేరును సంపాదించి పెట్టింది ‘శంకరాభరణం’ చిత్రము. ఈ సినిమాను 1979లోనే పూర్తిచేశారు. ఈ సినిమాను చూసి డిస్ట్రిబ్యూటర్స్ మొదట పెదవి విరిస్తూవచ్చారు. చివరకు ‘శంకరాభరణం’ 1980 ఫిబ్రవరి 2న విడుదలై మెల్లగా మౌత్ టాక్ తో మంచి పేరు సంపాదించి, ఆ యేడాది అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా నిలచింది. ఈ సినిమా తెలుగు సినీ అభిమానులు గర్వంగా చెప్పుకోగలిగే ఓ గొప్ప చిత్రంగా నిలిచిపోయింది! తమిళనాడు, కేరళలలోనూ ‘శంకరాభరణం’ ఘనవిజయం సాధించింది. దేశవిదేశాల్లో జయకేతనం ఎగురవేసింది. ‘శంకరాభరణం’ 43ఏళ్లు పూర్తిచేసుకున్న రోజున విశ్వనాథ్ చివరి శ్వాస విడిచాడ‌ని తెలిసి దుఃఖ సాగ‌రంలో మునిగిపోయారు.

also read:

horoscope today telugu : 03-02-2023 ఈ రోజు రాశి ఫ‌లాలు

Dried dates benefits : ఎండు ఖర్జూరంతో ఎనలేని ఉపయోగాలు.. రోజూ తప్పక తినండి!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News