HomecinemaDimple: రామబాణం హీరోయిన్‌కి గుడి క‌డ‌తానన్న అభిమాని.. షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చిన డింపుల్

Dimple: రామబాణం హీరోయిన్‌కి గుడి క‌డ‌తానన్న అభిమాని.. షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చిన డింపుల్

Telugu Flash News

Dimple: మాచో హీరో గోపించంద్ న‌టించిన తాజా చిత్రం రామ‌బాణం. ఈ చిత్రాన్ని లక్ష్యం, లౌక్యం లాంటి సూపర్ హిట్ చిత్రాలు తెర‌కెక్కించిన శ్రీవాస్ రూపొందించాడు. మ‌రి కొద్ది రోజుల‌లో మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుండ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. అయితే ఓ ప్రెస్ మీట్ లో అభిమాని.. మేడం.. మీరు నాకు ఓ విషయంలో పరిమిషన్ ఇస్తారా అని అడిగాడు. దీనికి హయతి ఏంటో చెప్పండి అని అనడంతో.. దానికి స్పందించిన అభిమాని మీకు నేను గుడి కట్టాలని అనుకుంటున్నా.. అది పాల రాయితో కట్టాలా? ఇటుకలతో కట్టాలా? అని అడిగాడు.

దానికి హ‌య‌తి చాలా తెలివిగా స్పందించింది. నాకు బంగారంతో గుడి కట్టండి అది చాలా బాగుంటుంది అంటూ అభిమానికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారంతా తెగ న‌వ్వేసారు.ఇక మరో అభిమాని.. మీపై ట్రోల్స్ వస్తే దానిని ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించ‌గా, దానికి స్పందించిన డింపుల్ మొదట్లో నాకు ట్రోల్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసేది కాదు.. కానీ ఇప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు అని స్ప‌ష్టం చేసింది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News