Telugu Flash News

Dilwale Dulhania Le Jayenge: మ‌ళ్లీ షారూఖ్ ప్రేమలో ప‌డండి.. DDLJ రీ రిలీజ్‌..!

Dilwale Dulhania Le Jayenge re release

Dilwale Dulhania Le Jayenge: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రిగా ఎదిగిన ఆయ‌న ఈ రోజు 57వ వ‌సంతంలోకి అడుగుపెట్డాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు వెల్లు వెత్తుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ ,కోలీవుడ్ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. మ‌రోవైపు షారూఖ్ ఖాన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే చిత్రాన్ని ఈ రోజు రీ రిలీజ్ చేస్తున్నారు. షారూఖ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా నవంబర్ 2 న ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా వివిధ సినిమా హాళ్లలో ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న జ‌రుపుకోనుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు.

ఫ్యాన్స్ కోసం..

1995 అక్టోబర్ 20న విడుదలైన ఈ సినిమాలో షారుక్ ఖాన్, కాజోల్ జంటగా నటించారు. ఈ సినిమా ఎప్పుడు చూసినా, ఎన్నిసార్లు చూసినా కూడా ఫ్రెష్ గా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. రాజ్, సిమ్రాన్ పాత్రలు అయితే జనాల గుండెల్లో అలానే నిలిచిపోయాయి. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. ఆదిత్య చోప్రా మేకింగ్ స్టైల్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఒక ఫీల్ ని కలిగించిన విధానం మళ్ళీ మళ్ళీ థియేటర్స్ లోకి వెళ్లేలా చేసింది. ఇక జతిన్ – లలిత్ అందించిన సంగీతం ఆల్ టైమ్ బెస్ట్ ఆల్బమ్స్ లో ఒకటిగా నిల‌వ‌డం విశేషం.

మహారాష్ట్రలోని మరాఠా మందిర్ థియేటర్ లో దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే 27 సంవత్సరాలుగా ఇంకా ఆడుతుంది అంటే సినిమా ప్రభావం ఎలా ఉండేదో అర్దం చేసుకోవ‌చ్చు..సినిమాలోని లవ్ ఎమోషన్స్ కి తోడు పాటలు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసాయి అనే చెప్పాలి. మెయిన్ గా “తుజే దేఖా తో” పాట గురించి ఎంత చెప్పినా త‌క్కువే. తెలుగు తమిళ్ ఆడియెన్స్ కూడా భాషతో సంబంధం లేకుండా కొన్నేళ్ల వరకు గ్యాప్ లేకుండా ఈ పాట‌ని విన్నారు, వింటున్నారు కూడా . కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమా 20కోట్లు కలెక్ట్ చేస్తే అందరూ షాక్ లో ఉండిపోయారు. భారత్‌లో మొత్తంగా రూ.89 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం విదేశాలలో 135 కోట్లు రాబ‌ట్టింద‌ట‌.

Read more news :

T20 World Record: టీ20 మ్యాచ్‌లో విధ్వంసం.. ఏకంగా 501 ప‌రుగులు న‌మోదు..!

Exit mobile version