HomecinemaDil Raju: త‌న రెండో పెళ్లి వెన‌క అస‌లు సీక్రెట్ చెప్పిన దిల్ రాజు.. అస‌లేం జ‌రిగిందో చెప్పిన నిర్మాత

Dil Raju: త‌న రెండో పెళ్లి వెన‌క అస‌లు సీక్రెట్ చెప్పిన దిల్ రాజు.. అస‌లేం జ‌రిగిందో చెప్పిన నిర్మాత

Telugu Flash News

Dil Raju: టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత‌ల‌లో దిల్ రాజు ఒక‌రు. ఈయ‌న సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే ఆయ‌న‌ గురించి మీడియాలో చర్చలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా దిల్ రాజు గురించి సోషల్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియా వరకు ఏదోక వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది. క‌రోనా స‌మయంలో ఆయ‌న రెండో పెళ్లి చేసుకోగా, ఇటీవ‌ల దీని గురించి ఎక్కువ‌గా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. పెళ్లి, ఆ త‌ర్వాత ప్ర‌గ్నెన్సీ ఇప్పుడు వారసుడు గురించి కాస్త హడావుడి నడుస్తుంది. దిల్ రాజు తన మొదటి భార్య అనిత మరణం తర్వాత కొన్నాళ్ళ పాటు సింగిల్‌గా ఉండి ఆ త‌ర్వాత త‌న‌కు న‌చ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. ఒక కొడుక్కి తండ్రి కూడా అవ్వడం ఒక సంచలనంగా మారింది.

దిల్ రాజు రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నాడు ఏంటీ అనే దానిపై క్లారిటీ లేకపోయినా వార్తలు ఎన్నో వచ్చాయి. ఇప్పుడు దిల్ రాజు తాను రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నాడో క్లారిటీ ఇచ్చాడు. భార్య మ‌ర‌ణం త‌ర్వాత తాను చాలా రోజుల పాటు ఒంట‌రిగా ఉండ‌డంతో డిస్ట‌ర్బ్ అయ్యాన‌ని పేర్కొన్నాడు. దీంతో త‌న పేరెంట్స్ బాగా కుంగిపోయార‌ని.. ఆ టైంలో త‌న కుమార్తె, అల్లుడు కూడా త‌న ద‌గ్గ‌రే ఉన్నార‌ని , కొద్ది రోజుల త‌ర్వాత వాళ్లు మ‌రో పెళ్లి చేసుకోమ‌ని చెప్ప‌డంతో కాద‌న‌లేక‌పోయాను. అటు త‌ల్లిదండ్రుల కోసం, ఇటు త‌న కుమార్తె ఎంక‌రేజ్ చేయ‌డంతో తాను ఈ రెండో పెళ్లి చేసుకున్నాన‌ని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

త‌న కుటుంబం స‌ఫ‌ర్ కాకూడ‌ద‌న్న ఉద్దేశంతోనే తాను రెండో పెళ్లి చేసుకున్నాన‌ని వివరించాడు. 2020లో తేజ‌స్వినితో త‌న రెండో వివాహం జ‌రిగింద‌ని దిల్ రాజు పేర్కొన్నాడు అయితే నాతో పెళ్లి అంటే ఆమెకు పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. సెలబ్రెటీ అంటే ప్లస్సులుంటాయి. మైనస్‌లు ఉంటాయి. సినిమాలు, ఫ్యామిలీ.. ఇలా అన్ని విషయాలు తనతో మాట్లాడాక, అంతా ఓక అనుకున్నాక త‌న‌తో పెళ్లికి రెడీ అయ్యాను. తర్వాత నాకు బిడ్డ పుట్టాడు. నా మొదటి భార్య అనిత (anitha) , రెండో భార్య వైగ్యా(vygya) పేర్లు కలిసొచ్చేలా వాడికి ‘అన్విరెడ్డి’ (anvy reddy) అని పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు అంద‌రం సంతోషంగా ఉన్నాం అని దిల్ రాజు అన్నాడు..

also read news:

biometric facial recognition system : ఫేషియల్ బయోమెట్రిక్స్..వ్యాపార సంస్థలకు ఈ టెక్నాలజీ వల్ల కలిగే 5 ముఖ్యమైన ప్రయోజనాలు

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News