Telugu Flash News

Dil Raju: దిల్ రాజు రాజ‌కీయాల్లోకి.. అస‌లు విష‌యం ఏంటంటే..!

dil raju

Dil Raju: సినీ ప్రముఖులు రాజకీయాల‌లో త‌మ‌దైన ముద్ర వేస్తున్న విష‌యం తెలిసిందే. కొంద‌రు హీరోలు, ప‌లువురు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌లు రాజ‌కీయాల‌లో తమ స‌త్తా చాటుత‌న్నారు. ఇక ఇప్పుడు దిల్ రాజు రాజకీయాల్లోకి ఎంట్రి ఇవ్వనున్నారు అనే వార్త సోషల్ మీడియాలో తెగ‌ చక్కర్లు కొడుతుంది.ఈ క్ర‌మంలో ఆయ‌న స్పందించారు. నేను పొలిటీకల్ ఎంట్రీ ఇస్తున్నట్లు ప‌త్రిక‌ల‌లో రాస్తారు. నాకు ఆసక్తి ఉందా? లేదా? అనేది ఎవరికీ ఏమాత్రం తెలియదు.

మా పెద్దన్నయ్య కోడలి పుట్టింటి వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఆంధ్రలో ఉన్నారు. మా చిన్న అన్నయ్య కూతురు వాళ్ళ మామ తెలంగాణలో ఎమ్మెల్యే. మా బంధువుల్లో కూడా రాజకీయ నాయకులు ఉన్నారు. నాకు సంబంధించిన వారిలో ఇంతమంది రాజకీయాల్లో ఉన్నా కూడా నా రాజకీయ ప్రవేశం గురించి నాకు తెలియదు. ఆ విషయాన్ని కాలమే నిర్ణయిస్తుంది అంటూ దిల్ రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా, బ‌ల‌గం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సిరిసిల్లలో ఎంతో అట్టహాసంగా నిర్వహించ‌డంతో పాటు వేడుక‌కి కల్వకుంట్ల తారక రామారావు ను ముఖ్య అతిథిగా ఆహ్వానించ‌డంతో అనుమానాలు మొద‌ల‌య్యాయి.

also read :

Delhi Liquor Scam : రేపు ఎమ్మెల్సీ కవిత విచారణ.. ఈడీ కి ట్విస్ట్‌ ఇచ్చిన రామచంద్ర పిళ్లై..!

summer fruits : సమ్మర్‌లో ఎలాంటి పండ్లు తినాలి.. ఈ 5 ఫ్రూట్స్‌ బెస్ట్‌!

moral stories in telugu : ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు

Spicy Potato poori : స్పైసీ పొటాటో పూరీ వేడి మీద చాలా బాగుంటాయి

Exit mobile version