Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. క్రికెటర్ గా స్టార్ డమ్ సాధించి.. తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అంతేకాక టీమిండియాకి చిరస్మరణీయ విజయాలు అందించాడు.
అయితే కొద్ది రోజుల క్రితం ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. మరోవైపు బిజినెస్ పనులు, నిర్మాతగాను కొత్త ప్రయత్నాలు చేస్తున్నాడు.
ధోనీ ఇటీవల తన పేరు మీద ఉన్న గ్లోబల్ స్కూల్‌కి వెళ్లి అక్కడ చిన్ననాటి జ్ఞాపకాలు షేర్ చేసుకున్నాడు. తాజాగా ధోనికి సంబంధించిన ఓ వీడియోని చెన్నై సూపర్ కింగ్స్ షేర్ చేసింది.
స్కూల్‌లో చదువుతున్నప్పుడు ఏ సబ్జెక్ట్ బాగా నచ్చిందంటూ ఓ చిన్న అమ్మాయి ధోనిని ప్రశ్న అడిగింది. ఈ ప్రశ్న విన్న వెంటనే చిరు నవ్వు నవ్వి.. ‘క్రీడలను సబ్జెక్ట్‌గా పిలుస్తా. నేను సగటు విద్యార్థిని. నేను కేవలం ఏడేళ్ల వయసు నుంచే క్రికెట్ ఆడుతున్నాను. అందుకే నేను చాలా అరుదుగా క్లాసులో ఉండేవాడిని. అయినా నేను మంచి విద్యార్థినే.
10వ తరగతిలో 66 శాతం మార్కులు, 12లో 56 శాతం మార్కులు వచ్చాయి’ అని తెలియజేశాడు. నేను పదవ తరగతి పాస్ అవుతాననే నమ్మకం తన తండ్రికి అప్పట్లో లేదని, కాని నేను 10వ తరగతిలో 66 శాతం, 12వ తరగతిలో 56 లేదా 57 శాతం మార్కులతో పాస్ అయ్యాను అంటూ ఆ నాటి జ్ఞాపకాలు పంచుకున్నారు.
నేను ఏ పాఠశాలకు వెళ్లినా, నేను టైమ్ మెషీన్‌కు చేరుకున్నట్లు ఉంటుంది . బడిలో గడిపిన కాలం తిరిగి రాదు. మీకు జ్ఞాపకాలు ఉంటాయి. ఇక్కడ మీరు చూసే స్నేహితులు మీ జీవితాంతం మీతో ఉంటారు’ అంటూ ధోని ఆసక్తికరంగా స్పీచ్ ఇచ్చాడు.
ధోని ఇప్పుడు దక్షణాది హీరోలతో సినిమాలు నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం.. ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఇప్పటికే బాలీవుడ్ లో రోర్ ఆఫ్ లయన్, బ్లేజ్ టు గ్లోరీ, ద హిడెన్ హిందూ అనే మూడు షార్ట్ ఫిల్మ్స్ చేసిన ధోనీ.. తన భార్యకు తన నిర్మాణ సంస్థ బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తుంది.
Even Thala’s favourite period is PT! 😉#WhistlePodu #Yellove 🦁💛 @msdhoni pic.twitter.com/t4MInuQhxu
— Chennai Super Kings (@ChennaiIPL) October 13, 2022