నెట్ ఫ్లిక్స్ (netflix) లో తమ మూడో త్రైమాసిక ఫలితాలను రిలీజ్ చేసింది. అందులో ధనుష్ (dhanush) నటించిన సినిమా ‘ది గ్రే మ్యాన్’ (the gray man) సినిమాతో పాటు మోన్ స్టర్, స్ట్రేంజర్ థింగ్స్, కొరియన్ సిరీస్ అయిన ఎక్స్ట్రా ఆర్డినరీ వూ ఎక్కువమంది వీక్షించిన సినిమా ల జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
రెండు త్రైమాసికాల్లో నష్టాల తర్వాత మొదటిసారి subscribers పెరగడం తమకు చాలా సంతోషం కలిగించిందని నెట్ ఫ్లిక్స్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ టెడ్ సారండోస్ అన్నారు. నెట్ ఫ్లిక్స్ 2022లో 17 బిలియన్ డాలర్ల బడ్జెట్ కంటెంట్ మీద పెట్టింది అని ఆయన తెలిపారు.
“చూసేవారు పెరగడమే కాకుండా మా కంటెంట్ ను ఇష్టపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు టెడ్. మంగళవారం సాయంత్రం తమ మూడో త్రైమాసిక ఫలితాలను ఈ కంపెనీ రిలీజ్ చేసింది.
నాలుగవ త్రైమాసికంలో ‘నైవ్స్ ఔట్’ సీక్వెల్ ‘గ్లాస్ ఆనియన్’ పై ఎక్కువ ఆశలు ఉన్నాయని. ‘గ్లాస్ ఆనియన్’ థియేటర్లలో రిలీజ్ అవుతుందని అది కూడా పరిమిత థియేటర్లలో వారం రోజులే ఉంటుందని తెలిపారు.
” మేము ప్రస్తుతానికి నెట్ ఫ్లిక్స్ ద్వారానే ప్రజలకు చేరువ అవుదామని అనుకుంటున్నాం” అని టెడ్ చెప్పారు.
” మా సినిమాలు ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడుతున్నాయి వాటిలో ఉన్న నాణ్యత వల్ల వాటికి డిమాండ్ ఉంది. కానీ అందరూ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు వెళ్లలేరు అందుకే ఈ వారం పాటు థియేటర్ రిలీజ్ చేస్తున్నాము ”
‘గ్లాస్ ఆనియన్’ నవంబర్ 23న థియేటర్ లో రిలీజ్ కాబోతుందని మరో నెల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుందని టెడ్ చెప్పారు.