Dhamaka telugu movie review : ‘క్రాక్’తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు మాస్ మహారాజా రవితేజ ఈ సంవత్సరం మాత్రం వరుసగా ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి భారీ డిజాస్టర్లను ఎదుర్కొని తన అభిమానులని నిరుత్సాహ పరిచాడు. ఈ సారి ఎలాగైనా భారీ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న కసితో రవితేజ ‘ధమాకా’ అనే సినిమాలో నటించాడు. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
కథ:
చిత్రంలో రవితేజ రెండు పాత్రల్లో కనిపించి అలరించాడు. ఈరెండు పాత్రల చుట్టూనే ఈ కథ నడుస్తుంది. స్వామి క్యారెక్టర్ లో రవితేజ ఒక మురికివాడలో నివసించే పేద, ఉద్యోగం లేని మాస్ పాత్ర.. ఇక మరో పాత్రలో ఆనంద్ చక్రవర్తి అనే మల్టీ మిలినీయర్ గా రవితేజ కనిపించారు. మల్టీ మిలినియర్ తండ్రిగా సచిన్ కేడ్కర్ నటించారు. అయితే ఈ కంపెనీని నందగోపాల్ పాత్రలో నటించిన జయరామ్ ఆక్రమించుకోవాలి అనిచూస్తాడు. ఈ విషయంలో డ్యూయల్ రోల్ చేసిన రవితేజ ఏం ప్లాన్ చేస్తారు.. ఎలా తమకంపెనీలను కాపాడుకుంటారు. అసలు ఈ ఇద్దరు పాత్రలకు ఉన్న లింక్ ఏమిటీ..? అనేది సినిమా చూస్తే అర్ధమవుతుంది.
పర్ఫార్మెన్స్:
మాస్ కథ కావడంతో రవితేజ తన పర్‌ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. తనదైన మార్క్ కామెడీతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కాకపోతే.. రవితేజ రోటీన్ కామెడీ కనిపించింది. ఇక శ్రీలీల రవితేజ జోడీగా అద్భుతం చేసిందని చెప్పాలి. రవితేజకు పోటీగా ఆమె పెర్ఫామ్ చేసింది. ఇక జయరామ్, సచిన్, తనికెళ్ళ భరణి వారి పాత్రల పరిదిమేర న్యాయంచేశారు. ఇక దర్శకుడు రొటీన్ కథ తీసుకున్నా డైరెక్షన్ బాగుంది. భీమ్స్ మ్యూజిక్‌తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది.
ప్లస్ పాయింట్స్:
నటీనటులు
మ్యూజిక్
రొమాన్స్
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ
ల్యాగ్ సన్నివేశాలు
చివరిగా:
రవితేజ నటించిన ‘ధమాకా’ మూవీ ఎన్నో అంచనాల నడుమ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘స్టోరీ అండ్ స్క్రీన్‌ప్లే ఫ్లాట్‌గా ఉంది. కానీ, సాంగ్స్, కామెడీ, కొన్ని అదిరిపోయే సన్నివేశాలతో దీన్ని ఆసక్తికరంగా మార్చారు. ఇందులో రవితేజ ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి . రవితేజ అభిమానులకి ఈ సినిమా తప్పక నచ్చుతుంది.