Telugu Flash News

Maharastra Assembly | దేవేంద్ర ఫడ్నవీస్‌, ఉద్ధవ్‌ ఠాక్రే రహస్య మీట్‌.. వీడియో వైరల్‌

Maharastra Assembly

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ (Maharastra Assembly) శీతాకాల సమావేశాల్లో భాగంగా తొలిరోజైన గురువారం చిరకాల ప్రత్యర్థులు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ (Devendra fadnavis) , శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్‌ ఠాక్రే (uddhav thackeray) అనుకోకుండా ప్రత్యేకంగా కలిశారు.

మాజీ సీఎంలైన ఉద్ధవ్ ఠాక్రే, దేవేంద్ర ఫడ్నవీస్ లిఫ్ట్ కోసం ఎదురు చూస్తుండగా ఇద్దరూ ఏదో విషయంపై మాట్లాడుకున్నారు.

ఏ విషయంపై మాట్లాడుతకున్నారో తెలియలేదు కానీ దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఉద్ధవ్‌ ఠాక్రే మధ్య పొత్తు ఉండవచ్చన్న రాజకీయ ఊహాగానాలు జోరందుకున్నాయి.

అనంతరం ఉద్ధవ్‌ ఠాక్రేను దీని గురించి మీడియా ప్రశ్నించింది. ఆయన, ఫడ్నవీస్‌ ఏం మాట్లాడుకున్నారని అని అడిగింది. ‘ఇక నుంచి రహస్య సమావేశాలన్నీ మేం లిఫ్ట్ లోనే చేస్తాం’ అని ఠక్రే సరదాగా అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్‌, తాను లిఫ్ట్‌లో ఉన్నప్పుడు 1965లో విడుదలైన జబ్ జబ్ ఫూల్ ఖిలే సినిమాలోని ‘నువ్వు తిరస్కరించినా, నీ ప్రేమలో పడ్డా’ అన్న పాత పాట ప్రజలకు గుర్తుకు వచ్చి ఉంటుందని తెలిపారు. అయితే అలాంటిదేమీ లేదని, అనుఉకోకకుండా తామిద్దరం కలిసినట్లు చెప్పారు.

మరోవైపు బీజేపీ మంత్రి చంద్రకాంత్ పాటిల్, ఉద్ధవ్ ఠాక్రే మధ్య సరదాగా మరో సంభాషణ జరిగింది. ఠాక్రేకు చంద్రకాంత్‌ చాక్లెట్‌ బార్‌ ఇచ్చారు. దీనికి స్పందించిన ఉద్ధవ్‌ ఠాక్రే ‘రేపు మీరు మహారాష్ట్ర ప్రజలకు చాక్లెట్ ఇస్తారు’ అని బదులిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకర్షించడానికి బడ్జెట్‌లో తాయిలాలు ప్రకటించే విషయాన్ని ఇలా ప్రస్తావించారు.

కాగా ఈ ప్రభుత్వంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, శివసేన (ఏక్‌నాథ్ షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్)ల అధికార కూటమి తక్కువ స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. 48 లోక్‌సభ స్థానాల్లో ఎంవీఏ 30, ఎన్డీఏ కూటమి 17 స్థానాలు గెలుచుకుంది.

 

 

Exit mobile version