నాన్ స్టాప్ గా పడుతున్న వర్షాలతో కేరళలో డెంగ్యూ కేసులు ( dengue cases) పెరుగుతున్నాయి. గత నాలుగు రోజుల్లో వందల సంఖ్యలో టైప్ 2 డెంగ్యూ జ్వరాలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ నాలుగు రోజుల్లో 5 మరణాలు, 309 కి పైగా టైప్ 2 డెంగ్యూ కేసులు నమోదైనట్లు కేరళ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కిందటి నెలలో 23 మంది డెంగ్యూ జ్వరాలతో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.
అయితే, ఆరోగ్య శాఖ ప్రకారం, ఇప్పటివరకు కేవలం 10 మరణాలు మాత్రమే నమోదయ్యాయి. మరణాల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. టైప్ 2 డెంగ్యూ కేసుల సంఖ్య కారణంగా కొల్లం, కోజికోడ్ జిల్లాలను డెంగ్యూ హాట్‌స్పాట్‌లుగా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. టైప్ 2 డెంగ్యూ జ్వరాలు వేగంగా పెరుగుతున్న దృష్ట్యా నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేశామన్నారు.
అయితే, ఈ ఏడాది జనవరి నుంచి కేరళలో 3,409 కేసులు నమోదు కాగా, 10,038 అనుమానిత కేసులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. డెంగ్యూతో పాటు సీజనల్ ఫీవర్లు, ర్యాట్ ఫీవర్, స్క్రబ్ టైఫస్ వంటి వ్యాధులను కూడా నిర్ధారిస్తున్నారు.
గతంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ 138 డెంగ్యూ హాట్‌స్పాట్‌లను గుర్తించగా, ఇప్పుడు ఆయా ప్రాంతాలపై దృష్టి సారించింది.
ఇది కూడా చదవండి :
Dengue fever : డెంగ్యూ జ్వరం అంటే ఏంటి ? లక్షణాలు, నివారణ తెలుసుకుందాం !