Delhi Weather : న్యూఢిల్లీ లో ఈ రోజు శనివారం ప్రొద్దున ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయానికి విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యం నెలకొంది. ఈ భారీ వర్షంతో ఉత్తర భారతాన్ని అతలాకుతలం చేస్తున్న వేడి గాలుల నుంచి ఉపశమనం లభించింది. ఈ రోజు ఉదయం ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రానున్న రెండు గంటల్లో ఢిల్లీ, ఎన్‌సీఆర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. IMD అధికారుల ప్రకారం, గంటకు 40-70 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
ఢిల్లీలో మరో రెండు మూడు రోజులు వర్షాలు కురుస్తాయని, మే 30 వరకు వేడి గాలులు ఉండవని వాతావరణ శాఖ తెలిపింది.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. రాజధాని నగరంలో భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
read more news :
Weather Today (27-5-2023): తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణం ఇలా..
Niharika:నిహారికతో విడాకుల విషయంపై క్లారిటీ ఇచ్చిన భర్త.. దీంతో ఫిక్స్ అయిపోవచ్చా..!