Telugu Flash News

Delhi Liquor Scam : రేపు ఎమ్మెల్సీ కవిత విచారణ.. ఈడీ కి ట్విస్ట్‌ ఇచ్చిన రామచంద్ర పిళ్లై..!

mlc kavitha

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (delhi liquor scam case) మలుపులు తిరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రేపు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు విచారణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇదే కేసులో నిందితుడిగా ఉన్న రామచంద్ర పిళ్లై ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు.

ఢిల్లీలో ఎక్సైజ్‌ పాలసీకి సంబంధించిన కేసులో ఇప్పటికే రామచంద్ర పిళ్లై అరెస్టు అయ్యారు. తాజాగా ఇవాళ ఆయన ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. తాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు ఇచ్చిన వాంగ్మూలాన్ని విత్‌డ్రా చేసుకొనేందుకు చాన్స్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రామచంద్ర పిళ్లై వేసిన పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం.. ఈడీకి నోటీసులు జారీ చేసింది.

ramachandran pillai

అసలేం జరుగుతుంది ?

మరోవైపు రేపు రామచంద్ర పిళ్లై వాంగ్మూలం ఆధారంగా చేసుకొనే ఎమ్మెల్సీ కవితను విచారణ చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రిపేర్‌ అవుతోంది. ఈ తరుణంలో రామచంద్ర పిళ్లై ఇలా ట్విస్ట్‌ ఇవ్వడంతో రేపు అసలేం జరుగుతందనేది ఉత్కంఠగా మారింది.

వాస్తవానికి ఈనెల 9వ తేదీన ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణ చేయాల్సి ఉండేది. అయితే, తనకు ముందుగానే ఖరారైన కార్యక్రమాల షెడ్యూల్‌ కారణంగా విచారణకు రాలేనని కవిత చెప్పారు. దీంతో ఈనెల 11వ తేదీన ఈడీ విచారణకు హాజరవుతానని తెలిపారు. ఇందుకు ఈడీ అధికారులు సమ్మతించారు.

ఈ నేపథ్యంలోనే ఇవాళ అరుణ్‌ రామచంద్ర పిళ్లై ఈ ట్విస్ట్‌ ఇవ్వడంతో కేసు విచారణ రసవత్తరంగా మారింది. ఈ కేసు విచారణలో భాగంగా రామచంద్ర పిళ్లై ఇచ్చిన వాంగ్మూలంలో తాను కవిత బినామీనని పేర్కొన్న సంగతి తెలిసిందే.

దీంతోపాటు ఆమె చెప్పినందుకే తన ఖాతాలోకి 32 కోట్లు వచ్చాయంటూ పిళ్లై ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. మరోవైపు ఒక కోటి రూపాయలు కూడా ఆయన సొంత ఖాతాలోకి పడ్డాయని అంగీకరించారు.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో సౌంత్‌ గ్రూపునకు 32.5 శాతం వాటాలు ఉన్నాయి. వీటిలో కూడా ఎమ్మెల్సీ కవితకు కమీషన్లు అందాయని ఈడీ అభియోగాలు మోపింది. పొందిన లాభాల్లో కవిత, పిళ్లై ఖాతాలకు నగదు వెళ్లిందని ఈడీ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయి.

మొబైల్‌ ఫోన్‌తో పాటు ఇతర ఆధారాలన్నీ ఈడీ సేకరించింది. ఇక రేపు అరుణ్‌ రామచంద్ర పిళ్లై సమక్షంలోనే ఎమ్మెల్సీ కవితను విచారణ చేసే చాన్స్‌ ఉంది. దీంతో ఈ కేసులో ఇప్పటికే చెప్పిన పలు అంశాలు తాను చెప్పలేదని కోర్టులో పిటిషన్‌ వేసే చాన్స్‌ కూడా ఉంది. ఈ పరిణామాల మధ్య రేపు విచారణ సందర్భంగా అసలేం జరగనుందనే ఉత్కంఠ ఏర్పడింది.

also read :

summer fruits : సమ్మర్‌లో ఎలాంటి పండ్లు తినాలి.. ఈ 5 ఫ్రూట్స్‌ బెస్ట్‌!

moral stories in telugu : ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు

Spicy Potato poori : స్పైసీ పొటాటో పూరీ వేడి మీద చాలా బాగుంటాయి

Naresh- Pavitra: ఎట్ట‌కేల‌కు ప‌విత్ర మెడ‌లో మూడు ముళ్లు వేసిన న‌రేష్‌..వైర‌ల్‌గా మారిన వీడియో

 

Exit mobile version