HomenationalDelhi Fog News : ఢిల్లీలో దట్టమైన పొగమంచు.. విమానాల రాకపోకలకు అంతరాయం

Delhi Fog News : ఢిల్లీలో దట్టమైన పొగమంచు.. విమానాల రాకపోకలకు అంతరాయం

Telugu Flash News

Delhi Fog News : దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో విజిబిలిటీ సరిగా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భారత వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో విజిబిలిటీ 125 మీటర్లకు పడిపోయింది. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లోని వివిధ ఎయిర్‌ పోర్టుల్లో కూడా విజిబిలిటీ 0 మీటర్లకు పడిపోయింది.

ఢిల్లీలోని పాలెం విమానాశ్రయం, అమృత్‌సర్‌, ఆగ్రా, గ్వాలియర్‌, ప్రయాగ్‌రాజ్‌, జైసల్మేర్‌ విమానాశ్రయాల్లో విజిబిలిటీ 0 మీటర్లకు పడిపోయింది. ఢిల్లీ సఫ్దార్‌గంజ్‌లో 200 మీటర్లు, షిల్లాంగ్‌ విమానాశ్రయంలో 300 మీటర్లకు విజిబిలిటీ పడిపోయింది.

దీంతో జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దట్టమైన పొగ మంచు కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక మరికొన్ని విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.

సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ చేరాల్సిన ఆరు విమానాలను సైతం దారి మళ్లించినట్లు వెల్లడించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన UK897 విమానం, ముంబై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన UK873 విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తిరిగి బెంగళూరుకు దారి మళ్లించారు.

ఈ పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీకి వెళ్లాల్సిన ప్రయాణికులు తమ విమానాల రాకపోకలను ముందస్తుగా తెలుసుకోవడం మంచిది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News