HomenationalMLC Kavitha : కొనసాగుతున్న ఎమ్మెల్సీ కవిత విచారణ.. ఉదయం నుంచి జరిగిన పరిణామాలివే..!

MLC Kavitha : కొనసాగుతున్న ఎమ్మెల్సీ కవిత విచారణ.. ఉదయం నుంచి జరిగిన పరిణామాలివే..!

Telugu Flash News

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (delhi liquor scam case) లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ను విచారణ చేస్తున్నారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలోని బృందం కవితను విచారిస్తోంది. లిక్కర్‌ స్కామ్‌లో అవకతవకలకు సంబంధించిన ప్రశ్నలను ఈడీ అధికారులు కవితను అడుగుతున్నారు. మధ్యలో కవిత విచారణకు 5 నిమిషాలు బ్రేక్ ఇచ్చారు అధికారులు. ఈ సమయంలో విచారణ గది నుంచి బయటకు వచ్చిన ఆమె.. మళ్లీ లోపలికి వెళ్లిపోయారు.

ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సౌత్‌ గ్రూపు పాత్రపై కవితను విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అరుణ్‌ పిళ్లై రిమాండ్‌ రిపోర్టు, ఆడిటర్‌ బుచ్చిబాబు వాట్సప్ చాటింగ్‌ ఆధారంగా ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కవితకు మద్దతుగా ఢిల్లీలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ. నైతిక మద్దతుగా నేతలంతా ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావు ఢిల్లీలో మకాం వేశారు. ధైర్యంగా ఉండాలని, తామంతా అండగా ఉంటామని కవితకు బీఆర్ఎస్ శ్రేణులు భరోసా ఇస్తున్నాయి.

మరోవైపు కవిత విచారణ ఢిల్లీలో జరుగుతుండగా.. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేత దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బీజేపీ స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బండి సంజయ్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కవితకు బండి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈడీ, బీజేపీ, మోదికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు.

కవిత విచారణలో భాగంగా లిక్కర్‌ స్కామ్‌లో ఆమె పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు, ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు, సుమారు వంద కోట్ల రూపాయల మేర ముడుపుల వ్యవహారంపై ఈడీ ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు లిక్కర్‌ స్కామ్‌లో కవిత పాత్రపై ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు..మౌఖికంగా, లిఖితపూర్వకంగా కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. రామచంద్ర పిళ్లై కూడా విచారణ గదిలో ఉన్నారు. మరోవైపు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వాకబు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావుల ద్వారా వివరాలు తెప్పించుకుంటున్నారు. ఇక ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

also read :

Chiranjeevi: వేణు నువ్వు ఇలాంటి షాకులిస్తే ఎలా చెప్పు.. చిన్న ఆర్టిస్ట్‌ని ఆకాశానికి ఎత్తిన చిరు

-Advertisement-

moral stories in telugu : గుంటనక్క గొప్పలు.. కథ చదవండి

Venkatesh: వెంక‌టేష్ నోటి నుండి ఆ మాట రావ‌డంతో ఉలిక్కిప‌డ్డ ఫ్యాన్స్..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News