Telugu Flash News

deepika padukone : దీపికా ప‌దుకొణేకి ఏమైంది.. ముంబై ఆసుప‌త్రిలో అడ్మిట్ కావ‌డంతో ఆందోళ‌న‌లో ఫ్యాన్స్

deepika padukone hospitalized

deepika padukone : అందానికి అందం, అద్భుత‌మైన అభిన‌యం ఉన్న న‌టీమ‌ణుల‌లో దీపికా ప‌దుకొణే త‌ప్పక ఉంటుంది. హాలీవుడ్‌కి అలా వెళ్లి ఇలా వ‌చ్చిన దీపిక ప్రస్తుతం హిందీ పరిశ్రమని ఏల్తోంది.

టాప్ -10 హీరోయిన్లలో ఒకరుగా వెలిగిపోతున్న ఈ అమ్మ‌డు ఒక‌వైపు హీరోల‌తో న‌టిస్తూనే మ‌రోవైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తూ మెప్పిస్తుంది. దీపికా 2018లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ను ప్రేమ వివాహం చేసుకుంది.

ఇక కన్నడ సినిమాతో కెరీర్ ను ప్రారంభించిన దీపికా పదుకొనే సల్మాన్ ఖాన్ తప్పించి మిగతా బాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించింది. ప్రస్తుతం ఈమె నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ప్రాజెక్ట్ K’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్నాడు.

ఏం జ‌రిగింది?

అయితే దీపికా పదుకొనె తాజాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారట. ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో అడ్మిట్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే చికిత్స అనంతరం ఆమె డిశ్చార్జ్ కూడా అయ్యారట.

బాలీవుడ్ మీడియా ఈ విష‌యంపై ప‌లు క‌థ‌నాలు ప్ర‌చురించిన ఎందుకు ఆసుప‌త్రిలో అడ్మిట్ అయింద‌నే విష‌యంపై క్లారిటీ ఇవ్వ‌లేదు. దీపికా కొన్నాళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. ప‌లు సంద‌ర్భాల‌లో కూడా ఆమె డిప్రెష‌న్‌ని లోన‌యిన‌ట్టు చెప్పుకొచ్చింది. కొన్ని సంద‌ర్భాల‌లో ఆత్మ‌హ‌త్యకు కూడా పాల్ప‌డిన‌ట్టు టాక్.

ర‌ణ్‌వీర్ సింగ్‌తో వివాహం తర్వాత కూడా దీపికా డిప్రెషన్ నుండి బయటపడలేదని వినికిడి. ఇక దీపికా ఆరోగ్య సమస్యలు ప్రాజెక్ట్ కే కి ఇబ్బందిగా మారుతున్నాయ‌ని తెలుస్తుంది. రూ. 500 కోట్ల ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఇటీవ‌ల కృష్ణం రాజు మృతి కార‌ణంగా కొద్ది రోజుల పాటు ఆగిన‌ట్టు వార్త‌లు రాగా, ఇప్పుడు దీపికా వ‌ల‌న కూడా ఆగే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తుంది. ప్రాజెక్ట్ కే చిత్రంతో పాటు షారుక్ ఖాన్ కి జంటగా జవాన్, పఠాన్ చిత్రాల్లో దీపికా హీరోయిన్ గా నటిస్తున్నారు.

Exit mobile version