దేశం లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో ఒకరైన రణ్ బీర్ కపూర్ మొత్తానికి ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. ఈ నెల ఏప్రిల్ 17 న అలియా భట్ తో వివాహం జరుగనుంది.
అలియా కి ముందు రణ్ బీర్, దీపికా పడుకొనే తో డేటింగ్ మరియు కత్రినా కైఫ్ తో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం తన మాజీ లవర్స్ దీపికా తన భర్త రణ్ వీర్ సింగ్ తో , మరియు కత్రినా విక్కీ కౌశల్ తో ఈ వివాహ వేడుక కు హాజరు కానున్నారని సమాచారం.
రణ్ బీర్ కపూర్ – అలియా భట్ వివాహ వేడుక ముంబై లో ఫేమస్ ఆర్ కె బంగళా లో జరగనుంది. బాలీవుడ్ ఇండస్ట్రిలోని అత్యంత సన్నిహితులు మరియు మిత్రులను మాత్రమే ఈ వేడుక కి ఆహ్వానించారని సమాచారం. ఈ నెల చివర్లో వివాహ రిసెప్షన్ ఉండనుంది.
మరిన్ని వార్తలు చదవండి
సుధ కొంగర – సూర్య కాంబినేషన్లో మరో సినిమా!
ప్రత్యేకంగా హిందీ సినిమా చేయనవసరం లేదు : మహేష్ బాబు