David Warner: డేవిడ్ వార్నర్.. ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ క్రికెట్‌తోనే కాదు సోషల్ మీడియా ద్వారా కూడా చక్కని వినోదాన్ని పంచుతూ ఉంటాడు. ఈ క్రికెటర్‌కి తెలుగులోను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆస్ట్రేలియా క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలని ఎంతో ఇష్టపడతాడు. వార్నర్ చేసిన స్వాప్ వీడియోలకి సూపర్ రెస్పాన్స్ వచ్చేవి. తగ్గేదేలే అంటూ.. వార్నర్ చూపించిన పుష్ప మేనరిజం అలానే బుట్టబొమ్మ పాటకు తన భార్యతో కలిసి వార్నర్ వేసి స్టెప్పులను ఇప్పటికీ ఫ్యాన్స్ మదిలో మెదులుతూనే ఉంటుంది. సన్‌రైజర్స్‌కు దూరమైనా సరే వార్నర్ మాత్రం ఇప్పటికీ తెలుగు సినిమాలకు, తెలుగు ప్రజలకు మాత్రం దగ్గరగానే ఉన్నాడు. తాజాగా వార్నర్ తెలుగు సినిమాలపై తనకున్న ఆసక్తి కనబరిచాడు.
తెలుగు సినిమాల్లో తనకు నటించాలని ఉందని స్టన్నింగ్ కామెంట్స్ చేశాడు వార్నర్. టాలీవుడ్ మూవీస్‌లో తనకు విలన్‌గా యాక్ట్ చేయాలని ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు తనకు ఆ ముగ్గురితో కలిసి పని చేయాలని ఉందని కూడా తెలియజేశాడు. మహేష్ బాబు, అల్లు అర్జున్, రష్మికా మందన్నతో కలసి పని చేయాలనేది తన డ్రీమ్ అని వార్నర్ స్పష్టం చేశాడు. తాజాగా ప్రముఖ యాంకర్ గౌరవ్ కపూర్ నిర్వహించిన ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’ కార్యక్రమంలో వార్నర్ ఈ విషయాలు చెప్పుకొచ్చాడు. అయితే వార్నర్ పాజిటివ్ క్యారెక్టర్ కాకుండా విలన్ రోల్లో కనిపించాలని ఉందని చెప్పుకు రావడం విశేషం. బాలీవుడ్లో తనకు ‘షీలా కీ జవానీ’, ‘మై తేరా హీరో’, ‘చమ్మక్ చల్లో’ సాంగ్స్ తెలుసని అవి చాలా ఇష్టమని అన్నాడు.
బుట్టబొమ్మ పాటకు డ్యాన్స చేయమని హైదరాబాద్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేయడంతో వారి అభ్యర్థన మేరకు చేయగా.. దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చిందని వార్నర్ గుర్తు చేసుకున్నాడు. కాగా, 2014లో సన్‌రైజర్స్ జట్టులో చేరిన డేవిడ్ వార్నర్ 2021 వరకుఆ ఫ్రాంచైజీతో పాటే కలిసి జర్నీ చేశాడు. 2016లో సన్‌రైజర్స్‌కు తొలి ఐపీఎల్ టైటిల్‌ను అందించిన అతడు 2021 సీజన్ల ఫామ్‌లో లేకపోవడంతో లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ సీజన్లో సన్‌రైజర్స్ యాజమాన్యం అతణ్ని కెప్టెన్సీ నుంచి తప్పించడంతోపాటు.. తుది జట్టు నుంచి కూడా తొలగించింది. అనంతరం వేలానికి కూడా రిలీజ్ చేసింది. 2022 సీజన్‌కు ముందు నిర్వహించిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ వార్నర్‌ను కొనుగోలు చేయగా, ఈ ఏడాది కప్ అందించలేకపోయాడు. వార్నర్ అద్భుత ప్రదర్శన కనబరచిన కూడా మిగతా ఆటగాళ్ల నుండి సరైన సక్సెస్ రాకపోవడంతో ప్లే ఆఫ్‌కి చేరకుండానే ఇంటి దారి పట్టింది.
also read :
David Warner: రిటైర్మెంట్ ఆలోచనలో డేవిడ్ వార్నర్.. తెలుగు సినిమాల్లోకి రాబోతున్నాడా..!