Telugu Flash News

David Warner: రిటైర్మెంట్ ఆలోచ‌న‌లో డేవిడ్ వార్నర్.. తెలుగు సినిమాల్లోకి రాబోతున్నాడా..!

David Warner: సాండ్ పేపర్ బాల్ ట్యాంపరింగ్ వివాదంతో డేవిడ్ వార్న‌ర్ కొన్నాళ్లు క్రికెట్‌కి దూరంగా ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియాలో ఏ ఫార్మాట్‌లోనూ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ చేయకుండా బ్యాన్ విధించింది ఆస్ట్రేలియా. నాలుగేళ్లు దాటినా ఆ నిషేధం కొనసాగుతోంది. అయితే ఇటీవ‌ల పంత్ గాయ‌ప‌డ‌డంతో ఇప్పుడు ఢిల్లీ కెప్టెన్‌గా వార్న‌ర్‌ని నియ‌మించే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. ఐపీఎల్‌ కారణంగా భారత్‌లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వార్నర్‌కు లక్షలాది మంది అభిమానులు ఏర్ప‌డ్డారు. 2021 సీజన్ వరకు సన్‌రైజర్స్ తరఫున ఆడిన వార్నర్‌ను భారత్‌లోని అభిమానులు ముద్దుగా డేవిడ్ భాయ్ అని పిలుచుకున్నారు.

ఇక ఇన్‌‌స్టాగ్రామ్ రీల్స్‌తోనూ వార్నర్ తెలుగు వాళ్లకు చాలా దగ్గరయ్యాడు. అల్లు అర్జున్, మహేశ్ బాబు పాటలు, వీడియోలకు వార్నర్ చేసిన స్కూప్ వీడియోలు అభిమానులను ఎంత‌గానో అలరించాయి. ఈ మధ్య పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదేలే.. అంటూ అల్లు అర్జున్‌లా వార్నర్ యాక్ట్ చేశాడు. ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఆటకు ఫిదా అయిన తెలుగు ప్రజలు.. టాలీవుడ్ సినిమాల పట్ల అతడు చూపిస్తోన్న అభిమానం చూసి ఓన్ చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఏడాది తర్వాత టెస్టుల నుంచి రిటైరయ్యే యోచనలో వార్నర్ ఉన్నాడు. 12 నెలలపాటు క్రికెట్ ఆడిన తర్వాత రిటైర్మెంట్ గురించి ఓ నిర్ణయానికి వస్తానని వార్నర్ సంకేతాలిచ్చాడు.

వచ్చే 12 నెలలపాటు పార్ట్ టైం కామెంట్రీ చేసి.. కామెంటేటర్‌గా కొనసాగే యోచనలో వార్నర్ ఉన్నాడని ముఫద్దల్ వోహ్రా అనే క్రికెట్ నిపుణుడు త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. దీనికి స్పందించిన నెట్‌ఫ్లిక్స్ ఇండియా.. వార్నర్ క్రికెట్ నుంచి రిటైర్ అయితే.. తెలుగు సినిమాల్లో నటించడమే అతడికి బాగా సెట్ అవుతుందని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ చూసిన వార్నర్.. లాఫింగ్ ఎమోజీలతో బదులిచ్చాడు. దీనికి నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఇష్టపడే ఆటగాడు డేవిడ్ వార్నర్. అతణ్ని తెలుగులోని బిగ్ స్టార్లతో కలిసి స్క్రీన్ మీద చూడాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా అల్లు అర్జున్‌తో’ అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మ‌రి రానున్న రోజుల‌లో ఏం జ‌రుగుతుందో..

Exit mobile version