Homecinemadasara telugu movie review : 'దసరా' తెలుగు మూవీ రివ్యూ

dasara telugu movie review : ‘దసరా’ తెలుగు మూవీ రివ్యూ

Telugu Flash News

dasara telugu movie review: వైవిధ్యమైన సినిమాలు, పాత్రలు చేస్తూ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటూ నేచుర‌ల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు నాని. ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్యాన్ని చాటుతూ ప్రేక్ష‌కులని అల‌రిస్తూ వ‌స్తున్నాడు. తాజాగా ద‌స‌రా అనే మాస్ ఓరియెంటెడ్ చిత్రంతో ప‌ల‌క‌రించాడు. ఇందులో నాని రేగిన జుట్టు, మెలి తిప్పిన మీసాలు, మ‌ట్టి ప‌ట్టిన‌ట్లున్న డ్రెస్ ధ‌రించి అంద‌రిలోభారీ అంచ‌నాలు పెంచాడు. ఈ చిత్రం కోసం నాని నిజంగానే ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాడ‌ని అంద‌రు అప్రిషియేట్ చేశారు. ఇన్నాళ్లు ఈ సినిమా కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూడ‌గా, నేడు ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. మ‌రి క‌థ ఏంటో చూద్దాం.

dasara telugu movie review

క‌థ‌:

ఈ చిత్రం తెలంగాణకు చెందిన గోదావరిఖని లో ఉన్న వీర్లపల్లి అనే ఊరి ప్ర‌జ‌లు, వారి జీవితాలు ఎలా ఉండేవి, బొగ్గు ఘ‌నుల‌తో వారికి ఉన్న సంబంధం అనే అంశాల‌తో చిత్రాన్ని రూపొందించారు. ధరణి (నాని ) తన స్నేహితులతో కలిసి బొగ్గు ని దొంగతనం చేస్తూ, మద్యం సేవిస్తూ , అందరితో గొడవ పడుతూ మల్లి మరుసటి రోజు వాట‌న్నింటిని మ‌ర‌చిపోతూ ఉంటాడు. అయితే రోజులు ఇలా సాగిపోతూ ఉండ‌గా, ఓ రోజు చిన్న నంబి ( షైన్ టామ్ చాకో ) యొక్క సిల్క్ బార్ లో గోడ‌వ‌ పడి అది కూడా మర్చిపోతాడు, అయితే చిన్న నంబి మాత్రం ఆ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంటాడు. అయితే ధరణి చేసిన పొరపాటు వల్ల తన ప్రేయసి వెన్నెల( కీర్తి సురేష్ ) మరియు అత‌ని స్నేహితుల జీవితాలలో అనేక ఇబ్బందులు త‌లెత్తుతాయి. మ‌రి వారి కోసం ధ‌ర‌ణి ఏం చేశాడ‌న్న‌ది క‌థ‌:

ప‌ర్‌ఫార్మెన్స్:

మునుపెన్నడు కనిపించని అవతారం లో నాని స‌రికొత్త లుక్ లో కనిపించి మంచి మార్కులు కొట్టేసాడు, ఇక ధరణి గా అతని భాష, వేషధారణ అన్ని పాత్రకి త‌గ్గ‌ట్టుగానే ఉన్నాయి. ఇక వెన్నెల గా కీర్తి సురేష్ అద‌ర‌గొట్టింది., చాల రకాల భావోద్వేగాల్ని చూపించాల్సిన ఆ పాత్రకి మంచి న్యాయం చేసింది. దీక్షిత్ శెట్టి, నాని స్నేహితుడి గామంచి ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక మలయాళం లో సుపరిచితుడు ఐన షైన్ టామ్ చాకో చిన్న నంబి అద‌ర‌గొట్టేశాడు. ఎవ‌రికి వారు త‌మ పాత్ర‌ల‌లో ఒదిగిపోయారు.

ఇక టెక్నిక‌ల్ విష‌యాకి వ‌స్తే కొత్త ద‌ర్శ‌కుడు అయిన చిత్రాన్ని అద్భుతంగా తీసాడు. శ్రీ కాంత్ ఓదెల ఆ గోదావరిఖని ప్రాంతానికి చెందిన వాడు అవ్వడం వల్ల, ఆ బొగ్గుగనుల నేపధ్యాన్ని అద్భుతంగా తెర పైన చూపించాడు, అయితే ఇవే కాకుండా ఒక చక్కటి భావోద్వేగాన్ని, యాక్షన్ తో చాల బాగా మిళితం చేసి ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచాడు. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం చిత్రాన్ని కి వెన్నెముక అని చెప్పాలి., ఇక సంతోష్ నారాయణన్ పాటలు సూప‌ర్ హిట్ కాగా, ఈ చిత్రం భావోద్వేగంతో కూడిన యాక్షన్ డ్రామా అని చెప్పాలి.

ప్ల‌స్ పాయింట్స్:

నటన
నేపధ్య సంగీతం
ఛాయాగ్రహణం

-Advertisement-

మైనస్ పాయింట్లు:

అక్కడక్కడా ఉహించే కథనం

విశ్లేష‌ణ‌:

కల్చర్ ని, ఒక ప్రాంతం జీవన విధానాన్ని, మనుసుకి హత్తుకునే విధంగా చిత్రాలు, తమిళ్ లో మరియు మలయాళం లో రావ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇప్ప‌డు తెలుగు సినిమాలు కూడా అటువైపు చూస్తున్నాయి. తెలంగాణాలో బొగ్గు గనుల నేపధ్యం లో యాక్షన్ డ్రామా తో రూపొందిన ద‌స‌రా వారి మాసిన జీవితాల‌ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించాయి. మొదటి భాగం లో మంచి కామెడీ , యాక్షన్ ఉండ‌గా సినిమా కాస్త గాడి తప్పుతుంది అనే సమయంలో అద్దిరిపోయే ఇంటర్వెల్ ట్విస్ట్ తో, రెండవ భాగం చూడాలి అనే ఉత్సుకతని సృష్టించాడు ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ఎంతో భావోద్వేగంతో కూడిన క‌థగా రూపొందింది.

రేటింగ్ :  3/5

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News

తెలంగాణాలో బొగ్గు గనుల నేపధ్యం లో యాక్షన్ డ్రామా తో రూపొందిన ద‌స‌రా వారి మాసిన జీవితాల‌ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించాయి. మొదటి భాగం లో మంచి కామెడీ , యాక్షన్ ఉండ‌గా సినిమా కాస్త గాడి తప్పుతుంది అనే సమయంలో అద్దిరిపోయే ఇంటర్వెల్ ట్విస్ట్ తో, రెండవ భాగం చూడాలి అనే ఉత్సుకతని సృష్టించాడు ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ఎంతో భావోద్వేగంతో కూడిన క‌థగా రూపొందింది.dasara telugu movie review : 'దసరా' తెలుగు మూవీ రివ్యూ