Telugu Flash News

Danish Kaneria : పాక్ జెర్సీ చూస్తే పండ్ల దుకాణం ముందున్న‌ట్టు ఉంది..ఇండియా జెర్సీ అలా..!

Danish Kaneria : మ‌రి కొద్ది రోజుల‌లో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుండ‌గా, ఈ టోర్నీలో అద్భుతంగా రాణించి క‌ప్ కొట్టాల‌ని కొంత మంది స్కెచ్‌లు వేస్తున్నారు. అయితే ఫేవ‌రేట్ జ‌ట్లుగా ఉన్న పాకిస్తాన్, ఇండియా జ‌ట్లు కొద్ది రోజులుగా దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న నేప‌థ్యంలో మాజీలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ప్ర‌స్తుతం పాక్, ఇంగ్లండ్ మ‌ధ్య టీ 20 సిరీస్ జ‌రుగుతుండ‌గా, తొలి మ్యాచ్‌లో పాక్ ఓట‌మి పాలైంది. అదే రోజు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20 జర‌గగా, భారత్ విధించిన 209 పరుగుల రికార్డు లక్ష్యాన్ని సైతం ఆసీస్ అల‌వోక‌గా చేదించింది.

క‌నేరియా కామెంట్స్..

ఆసియా క‌ప్‌లోను పాక్, ఇండియా టైటిల్ ఫేవ‌రేట్స్‌గా బరిలోకి దిగితే శ్రీలంక టైటిల్ ఎగ‌రేసుకుపోయింది. ఆసియా కప్‌లో పేలవమైన ప్రదర్శన కనబరిచిన భారత్, పాకిస్తాన్‌ జట్ల నుండి అభిమానులు పాజిటివ్ ఇంటెంట్ గేమ్ ఆశిస్తున్నారని కనేరియా స్ప‌ష్టం చేశాడు.

రీసెంట్ గా జ‌రిగిన తొలి టీ20ల్లో ఇరు జట్లు ఓడిపోయాక ఫ్యాన్స్ బాగా నిరుత్సాహానికి గురయ్యారని, రెండు ఆసియా దిగ్గజ టీంల నుంచి ఇలాంటి ప్రదర్శన ఆశించలేమని, వ‌ర‌ల్డ్ క‌ప్ ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో వారు స‌న్న‌ద్ధం కావాలంటూ క‌నేరియా చెప్పుకొచ్చాడు.

రెండు ఆసియా పవర్‌హౌస్‌లు అయిన టీంల ప్ర‌ద‌ర్శ‌న ఇటీవ‌ల దారుణంగా మారింది. స‌మయం లేదు రెండు టీంలు మ‌ళ్లీ లైన్‌లోకి రావాలి అని డానిష్ కనేరియా తన యూట్యూబ్ ఛానెల్‌లో తెలిపాడు. ఇకపోతే టీ20ప్రపంచకప్‌కు ముందు భారత్, పాకిస్తాన్ జట్లు రెండూ కొత్త జెర్సీలను ఆవిష్కరించగా, ఇవి అభిమానుల‌ని ఆక‌ట్టుకోవ‌డం లేదు.

దీనిపై క‌నేరియా స్పందిస్తూ..’ పాకిస్తాన్ జెర్సీ పుచ్చకాయ లాగా ఉంది. ఆన్ లైన్లో ‘ఫ్రూట్ నింజా’ అనే గేమ్ ఉంటుంది., దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నట్లు ఉన్నారు. భారత జట్టు జెర్సీ కూడా లేత రంగులో ఉంది. లైట్ రంగులలో ఉంటే ప్లేయర్లు కూడా డల్‌గా కనిపిస్తారు. ఆసీస్‌తో మ్యాచ్‌లో భార‌త ఆట‌తీరు ఎంత డ‌ల్‌గా ఉందో, దాన్ని రిప్రజెంట్ చేసేలా జెర్సీ ఉంది అని కనేరియా చుర‌కలు అంటించాడు.

Exit mobile version