చలికాలంలోకి అడుగుపెడుతున్నాం అంటేనే చలితో పాటు వణికించే మరో ఇబ్బంది గాలి కాలుష్యం. ఫలితం ఊపిరితిత్తుల మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. అయితే ఈ కాలంలో దొరికే సీతాఫలం (custard apple) ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చక్కని పరిష్కారం అని నిపుణులు చెపుతున్నారు.
ఇందులో B6 విటమిన్ ఉండడం వల్ల ఊపిరితిత్తులలో వచ్చే వాపు ఇది తగ్గిస్తుంది. ముఖ్యంగా ఆస్తమా ఉన్న వారు ఈ పండుని తీసుకోవడం వల్ల సహజంగా ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుంది. ముఖ్యంగా రోడ్డు పక్కన పెరిగే సీతాఫలం చెట్లకు ఉండే పండ్లు తీసుకోవడం వల్ల ఫలితం మెరుగ్గా ఉంటుంది.
ఈ పండు యొక్క ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఎన్నో అధ్యయనాలలో నిరూపించబడ్డాయి. వీటిని ఆయుర్వేద మందులలో కూడా వాడుతున్నారు. ఆ చెట్టు యొక్క వేళ్లు, ఆకులు మిగిలిన వన్ని కూడా ఎన్నో చికిత్సలలో వాడుతున్నారు.
ఒక సీతాఫలం తీసుకోవడం వల్ల వచ్చిన క్యాలరీలు ఒక యాపిల్ తీసుకోవడం కంటే రెండింతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వెంటనే శక్తిని ఇస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. సీతాఫలం సోడియం మరియు పొటాషియం సమతుల్య నిష్పత్తి కలిగి ఉండడం బీపీ వంటివి తగ్గిస్తుంది. ఇందుకు అధిక మాగ్నిసిస్ ప్రేగులకు మంచిది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. ఈ పండు ఉదర సంబంధిత సమస్యలైన అల్సర్, ఎసిడిటీ వంటి వాటికి చక్కని పరిష్కారం.
ఈ రుచికరమైన పండును ఒకవేళ మీరు వేగన్ అయితే మీ డైట్ లోకి చక్కగా తీసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ఉపయోగాలు ఉన్న పండు రుచిని ఈ చలికాలం మొత్తం ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి.
ఇవి కూడా చూడండి :
ముఖంపై నల్ల మచ్చలు పోవాలంటే.