Homehealthcustard apple : సీతాఫలం ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చక్కని పరిష్కారం..!

custard apple : సీతాఫలం ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చక్కని పరిష్కారం..!

Telugu Flash News

చలికాలంలోకి అడుగుపెడుతున్నాం అంటేనే చలితో పాటు వణికించే మరో ఇబ్బంది గాలి కాలుష్యం. ఫలితం ఊపిరితిత్తుల మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. అయితే ఈ కాలంలో దొరికే సీతాఫలం (custard apple) ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చక్కని పరిష్కారం అని నిపుణులు చెపుతున్నారు.

ఇందులో B6 విటమిన్ ఉండడం వల్ల ఊపిరితిత్తులలో వచ్చే వాపు ఇది తగ్గిస్తుంది. ముఖ్యంగా ఆస్తమా ఉన్న వారు ఈ పండుని తీసుకోవడం వల్ల సహజంగా ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుంది. ముఖ్యంగా రోడ్డు పక్కన పెరిగే సీతాఫలం చెట్లకు ఉండే పండ్లు తీసుకోవడం వల్ల ఫలితం మెరుగ్గా ఉంటుంది.

ఈ పండు యొక్క ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఎన్నో అధ్యయనాలలో నిరూపించబడ్డాయి. వీటిని ఆయుర్వేద మందులలో కూడా వాడుతున్నారు. ఆ చెట్టు యొక్క వేళ్లు, ఆకులు మిగిలిన వన్ని కూడా ఎన్నో చికిత్సలలో వాడుతున్నారు.

custard-apple-500x500ఈ పండు తియ్యగా ఉండడం వల్ల ఈ లాభాలన్నీ పెద్దగా బయటకి తెలియడం లేదు. ముఖ్యంగా ఈ పండును తీసుకోవడం మధుమేహం ఉన్నవారికి మరియు గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ప్రమాదం. 100 గ్రాముల సీతాఫలం తీసుకుంటే అందులో 94 క్యాలరీలు, 2.1గ్రాముల ప్రోటీన్లు, 4.4 గ్రాముల ఫైబర్ ఇంకా 230 గ్రాముల కార్బోహైడ్రేట్లు అందుతాయి.

ఒక సీతాఫలం తీసుకోవడం వల్ల వచ్చిన క్యాలరీలు ఒక యాపిల్ తీసుకోవడం కంటే రెండింతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వెంటనే శక్తిని ఇస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. సీతాఫలం సోడియం మరియు పొటాషియం సమతుల్య నిష్పత్తి కలిగి ఉండడం బీపీ వంటివి తగ్గిస్తుంది. ఇందుకు అధిక మాగ్నిసిస్ ప్రేగులకు మంచిది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. ఈ పండు ఉదర సంబంధిత సమస్యలైన అల్సర్, ఎసిడిటీ వంటి వాటికి చక్కని పరిష్కారం.

ఈ రుచికరమైన పండును ఒకవేళ మీరు వేగన్ అయితే మీ డైట్ లోకి చక్కగా తీసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ఉపయోగాలు ఉన్న పండు రుచిని ఈ చలికాలం మొత్తం ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి.

-Advertisement-

ఇవి కూడా చూడండి :
ముఖంపై నల్ల మచ్చలు పోవాలంటే.

బరువు తగ్గేందుకు సీతాఫలం ఎంతో మేలు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News