Lakhs worth 500rs currency Notes showered at Gujarat Sarpanch’s nephew’s wedding :
ఈ మధ్య దేశం లోని పలు చోట్ల నోట్లను వెదజల్లటం కామన్ అయిపోయింది. అది ఏదైనా శుభ సందర్బమైన లేదా.. వైరల్ కావటానికైనా ఇలా చేస్తుంటారు.. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు.. ఇలాంటిదే ఓ పెళ్లి లో జరిగింది. అక్కడ కాస్త తొక్కిసలాట, తోపులాట కూడా జరిగింది..
అసలు విషయం లోకి వెళ్తే.. గుజరాత్ రాష్ట్రంలో మెహసానా ప్రాంతం లోని ఓ ఇంటి నుంచి రూ. 500 నోట్ల వర్షం కురిసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిల్లాలోని ఓ గ్రామంలో ఓ కుటుంబం తమ కుమారుడి పెళ్లి వేడుకలు జరుపుకుంటూ సంతోషం తో ఇంట్లో నుంచి నోట్లను కిందకు విసిరేశారు . వీడియోలో, టెర్రస్‌పై నిలబడి ఉన్న వ్యక్తులు నోట్లను కిందకు విసురుతున్నారు.
గాలికి నోట్లు ఎగసిపడటంతో వర్షం కురుస్తున్నట్లు కనిపించింది. వాటిని సేకరించేందుకు ప్రజలు పరుగులు తీశారు. పడిపోయిన, ఎగిరిపోతున్న నోట్లను పట్టుకునేందుకు ప్రజలు పోటీపడటంతో కాస్త తొక్కిసలాట జరిగింది. మాజీ సర్పంచ్ కరీంబాయి దాదుబాయి జాదవ్ మేనల్లుడు రజక్ వివాహం సందర్భంగా కుటుంబీకులు ఈ నోట్లను విసిరినట్టు తెలుస్తోంది. తమ కుటుంబంలో రజక్ ఒక్కడే మగబిడ్డ అని, అతడి పెళ్లి సందర్బంగా తమ వద్ద ఉన్న నోట్లను ఆనందంతో గాల్లోకి విసిరారు.
#SorosGang भिखारी ए भारत हे तेरे वाहा filmo मे रुपीया उडते हे 🤣🤣🤣
गुजरात मेहसाणा pic.twitter.com/T7lKnK8AnA— akshaypatel (@akshayhspatel) February 18, 2023
also Read:
YS Sharmila: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు.. షర్మిల అరెస్టు, పాదయాత్ర క్యాన్సిల్!
YS Avinash Reddy : అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ పిలుపు.. 24న విచారణకు రావాలని సూచన