Cricketers: యువ క్రికెటర్స్ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. అయితే వరుస షెడ్యూల్స్ తో బిజీగా ఉన్న నేపథ్యంలో సిరీస్ మధ్యలో దొరికిన గ్యాప్‌లో ముగ్గురు శ్రీలంక క్రికెటర్స్ ఒకే రోజు పెళ్లి చేసుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
శ్రీలంక జట్టు ప్రస్తుతం అప్ఘాన్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడుతుండగా.. రెండో వన్డే ముగిశాక.. మూడు రోజుల విరామం లభించిన నేపథ్యంలో లంక క్రికెటర్లు కసున్ రజిత, పతుమ్ నిస్సంక, చరిత్ అసలంక పెళ్లిళ్లు చేసుకోని షాక్ ఇచ్చారు. ఈ ముగ్గురికీ శ్రీలంక క్రికెట్ బోర్డ్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేయడంతో పాటు వారి పెళ్లి ఫొటోలను లంక బోర్డు ట్వీట్ చేసింది.
పెళ్లి తంతు ముగిసిన తర్వాత శ్రీలంక జట్టు సెలబ్రేషన్స్ లో పాల్గొంది. హిందీ పాటలకు డ్యాన్స్ లు చేస్తూ నానా రచ్చ చేసారు. పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను శ్రీలంక క్రికెటర్ లాహిరు మదుషంక సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
బాలీవుడ్ చార్ట్ బస్టర్ ‘దేశీ గర్ల్’కు పెళ్లి కొడుకు రజితతోపాటు రమేశ్ మెండిస్, ప్రవీణ్ జయవిక్రమ, దిల్షాన్ ముదషంక, లసిత్ ఎంబల్దేనియా స్టెప్పులేస్తుండడం వారి ఫ్యాన్స్ ని ఎంతగానో అలరిస్తుంది.
ఇదిలా ఉంటే శ్రీలంక, అప్ఘానిస్థాన్ మధ్య చివరి వన్డే బుధవారం క్యాండీలో జరగనుంది. తొలి మ్యాచ్‌లో అప్ఘానిస్థాన్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో అప్ఘాన్ జట్టు 1-0 ఆధిక్యంలో ఉండగా, చివరి మ్యాచ్‌లో శ్రీలంక గెలిస్తేనే సిరీస్ సమం అవుతుంది.
తొలి వన్డేలో శ్రీలంక ఓడినప్పటికీ నిస్సంక 85 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన ఫలితం దక్కలేదు. ఆతిథ్య జట్టు 60 పరుగుల తేడాతో దారుణ ఓటమిపాలైంది. శ్రీలంకపై మ్యాచ్ గెలవడంతో 115 పాయింట్లు సాధించిన అప్ఘానిస్థాన్.. ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో ఏడో స్థానానికి చేరుకుంది.
టాప్-8 టీమ్‌లు వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయనే విషయం తెలిసిందే.. శ్రీలంక ప్రస్తుతం పదో స్థానంలో ఉండగా, ఆ జట్టు మరో నాలుగు మ్యాచ్‌లే ఆడాల్సి ఉండటంతో.. టాప్-8లో నిలవడం కొంత కష్టం అనే చెప్పాలి.
also read news:
Dil Raju: తన రెండో పెళ్లి వెనక అసలు సీక్రెట్ చెప్పిన దిల్ రాజు.. అసలేం జరిగిందో చెప్పిన నిర్మాత