క్రికెట్ క్రీడలో ప్రేక్షకులను మెప్పించడం, వారి ఆదరణను పొందడం అనుకున్నంత సులువైన పని కాదు. అలాంటి ఆటలో తమ ప్రతిభను చూపి, అందరి ప్రశంసలు అందుకున్న వారిలో డేవిడ్ వార్నర్ (David Warner) కూడా ఒకరు. అంతటి ప్రతిభ కలిగిన డేవిడ్ వార్నర్ గురించి తెలుసుకోవాలి అంటే ఇది చదవాల్సిందే.
1986,అక్టోబర్ 27న తూర్పు సిడ్నీ లోని పాడ్డింగ్ టన్ లో ఒక మామూలు కుటుంబానికి చెందిన లొరైన్ వార్నర్ కి జన్మించాడు డేవిడ్ వార్నర్.
చిన్నప్పట్నుంచి చదువులో పర్లేదనిపించుకుంటూ వచ్చిన వార్నర్, చదువుతో పాటు ఆటలపై ముఖ్యంగా క్రికెట్ పై ఇష్టాన్ని పెంచుకున్నాడు.
అలా క్రికెట్ పై ఇష్టంతో 13 ఏళ్లకే కోచింగ్ తీసుకోవడం మొదలు పెట్టిన వార్నర్, ఎడమ చేతి వాటం కలిగిన వాడు కావడంతో ఎడమ చేతితో బ్యాటింగ్ చేసే వాడట.
అయితే కొన్ని రోజులకి తన కోచ్ కుడి చేతితో ఆడమని చెప్పడంతో తన బ్యాటింగ్ విధానం మార్చడంలో ఇబ్బంది పడిన వార్నర్,ఆ తరువాత తన తల్లి లొరైన్ వార్నర్ యెడమ “చేతితోనే ఆడు,పర్లేదు” అని చెప్పడంతో మళ్ళీ యెడమ చేతితో ఆడడం మొదలు పెట్టాడు.
ర్యాంద్విక్ బాయ్స్ హై స్కూల్లో తన చదువుని పూర్తి చేసుకున్న వార్నర్ 15 ఏళ్లకే ఈస్టర్న్ సభుర్బ్స్ (Eastern suburbs) క్లబ్ లో ఫస్ట్ గ్రేడ్ ఆటగాడిగా చేరి తన క్రీడా జీవితాన్ని మొదలు పెట్టాడు.
వార్నర్ ఇంటర్నేషల్ జర్నీ:
అలా ఈస్టర్న్ సభుర్బ్స్ (Eastern suburbs) క్లబ్ లో చేరిన వార్నర్,అందర్నీ అబ్బురపరిచే తన ఆటతో అనతి కాలంలోనే ఇంటర్నేషల్ టీం కి ఆడే స్థాయికి ఎదిగాడు.
ఆస్ట్రేలియన్ అండర్-19 లో చోటు సంపాదించి అంతర్జాతీయ క్రికెటర్ గా తన జీవితాన్ని మొదలు పెట్టాడు.
శ్రీ లంకతో ఆస్ట్రేలియన్ అండర్-19 జట్టులో ఆటగాడిగా ఆడి తొలి సారిగా తన ఆటను ప్రపంచానికి పరిచయం చేసాడు.
అప్పట్నుంచి తన ఆటతో అందర్నీ మైమరిపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వార్నర్ ఆఖరికి మన భారతీయుల అభిమానాన్ని కూడా దక్కించుకున్నాడు.
2014 నుండి 2021 వరకు ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆటగాడిగా ఆడిన వార్నర్ కరోనా కాలంలో తెలుగు పాటలకు డాన్సులు వేస్తూ,రీల్స్ పోస్ట్ చేస్తూ మన వాళ్ళ మనసులకు మరింత దగ్గరయ్యాడు.
ఇక వార్నర్ అవార్డులు,రికార్డుల విషయానికి వస్తే ఆయన సాధించిన అవార్డులు అన్నీ ఇన్నీ కాదు.
2017 జనవరిలో అలన్ బోర్డర్ మెడల్‌ను ఎక్కువసార్లు గెలుచుకున్న నాల్గవ ఆటగాడిగా నిలిచి అందర్నీ అవాక్కయ్యేలా చేసిన వార్నర్,ఆ తరువాత సంవత్సరాల్లో వరుసగా అవార్డును కూడా గెలుచుకున్నాడు.
2017, సెప్టెంబర్ 28న తన 100వ ODI ఆడిన వార్నర్, ఆ 100వ ODIలో సెంచరీ చేసిన మొదటి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ గా మరియు 8వ బ్యాట్స్‌మన్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు.
2022 december, 26 బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్ స్టార్ డేవిడ్ వార్నర్ తన 100వ టెస్టును ఓ మధుర జ్ఞాపకంగా చేసుకున్నాడు. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆడిన వార్నర్ డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో 100వ టెస్టులో సెంచరీ చేసిన రెండో వ్యక్తిగా నిలిచాడు.
ఇలా ఎన్నో రికార్డులు,రివార్డులు అందుకుని అందరి అభిమానాన్ని పొందిన వార్నర్,రానున్న కాలంలో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తాడో…. ఇంకెన్ని సెంచురీలు చేస్తాడో…. చూడాలి మరి.
మరిన్ని వార్తలు చదవండి :
తెలంగాణ వార్తలు | జాతీయ వార్తలు | సినిమా వార్తలు | అంతర్జాతీయ వార్తలు | ఆరోగ్య చిట్కాలు