Telugu Flash News

Ashes Series 2023 : చరిత్ర సృష్టించిన బెన్‌ స్టోక్స్‌.. ధోని ప్రపంచ రికార్డు బద్దలు

cricketer ben stokes breaks dhoni record

cricketer ben stokes breaks dhoni record

Ashes Series 2023 : ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా హెడింగ్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 251 పరుగుల లక్ష్యాన్ని మూడు అదనపు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయవంతంగా సాధించింది.

ఈ విజయంతో కెప్టెన్ బెన్‌స్టోక్స్ ఖాతాలో ప్రపంచ రికార్డు చేరింది. అతని కెప్టెన్సీలో జట్టు 250 మరియు అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటి వరకు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండగా.. ఇప్పుడు ఆ రికార్డును స్టోక్స్ చెరిపేశాడు.

గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ చేసింది. వరుసగా 277, 299, 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అలాగే గతేడాది జూలైలో ఎడ్జ్‌బాస్ట్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఈ రికార్డు స్టోక్స్ ఖాతాలో చేరింది.

250కి పైగా లక్ష్యాన్ని ఐదుసార్లు ఛేదించడం ద్వారా స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ అగ్రస్థానంలో ఉండగా, ధోనీ నేతృత్వంలోని భారత జట్టు 4 సార్లు ఈ ఘనత సాధించింది. బ్రియాన్ లారా, రికీ పాంటింగ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. యాషెస్‌ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా విజయం సాధించగా, మూడో టెస్టులో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. నాలుగో టెస్టు ఈ నెల 19న ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ప్రారంభం కానుంది.

also read :

horoscope today in telugu : 10-07-2023 ఈ రోజు రాశి ఫలాలు

Exit mobile version