OG Movie : ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ లీక్ హల్‌చల్ చేస్తోంది. టైటిల్‌ని బట్టి ఈ సినిమా కథ కొరియన్ నేపథ్యంలో ఉంటుందని అర్థమవుతోంది. పవన్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. ఇదంతా ఒక ఎత్తయితే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన వార్తలు సర్వత్రా ఆసక్తిని రేపుతున్నాయి.
ఇక, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నాలుగు పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నాడని మనకి తెలిసిందే. హరిహర వీరమల్లు షూటింగ్ అనుకున్నంతగా సాగడం లేదు. ఈ గ్యాప్‌లో పవన్ ఓజీ, బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. ఒకే సారి నాలుగు సినిమాలు చేస్తూ ఇంత బిజీగా ఉండడం తన కెరీర్‌లో ఇదే తొలిసారి. వచ్చే ఏపీ ఎన్నికలలోపు ఈ సినిమాలను పూర్తి చేసి విడుదల చేయాలన్నది పవన్ టార్గెట్. అందుకే రెస్ట్ లేకుండా షూటింగ్ చేస్తున్నారు.
బాలు, పంజా వంటి చిత్రాల తర్వాత పవన్ గ్యాంగ్‌స్టర్ మూవీ చేస్తున్నాడు. ఓజీ గ్యాంగ్ స్టర్ గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘విక్రమ్’ ఫేమ్ అర్జున్ దాస్ కథానాయకుడిగా నటిస్తున్నారు. తాజాగా శనివారం ఓజీ సెట్‌లోకి అడుగుపెట్టాడు. రెండు రోజుల క్రితం పవన్ ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ లీక్ హల్ చల్ చేస్తోంది. టైటిల్‌ని బట్టి ఈ సినిమా కథ కొరియన్ నేపథ్యంలో ఉంటుందని అర్థమవుతోంది. పవన్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. ఇదంతా ఒక ఎత్తయితే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన వార్తలు సర్వత్రా ఆసక్తిని రేపుతున్నాయి. 1950లో జరిగే కథ అని తెలిసిందే.ఆ కాలంలో పవన్ పెద్ద గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. దీనికి సంబంధించిన పవన్ పాతకాలపు లుక్ అద్భుతంగా ఉంటుందని, పవన్ పాత్ర చాలా సీరియస్ గా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఇందులో ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ ఎపిసోడ్స్‌ను ప్లాన్ చేసింది సుజీత్ టీమ్. అవి సినిమాకే హైలైట్‌గా ఉండబోతున్నాయని, ఇప్పటి వరకు టాలీవుడ్ సినిమాల్లో ఈ తరహా యాక్షన్ కనిపించలేదని అంటున్నారు.
కాగా, ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత అనేది తేలాల్సి ఉంది. కానీ ఓజీకి సంబంధించిన అప్ డేట్ లీక్స్ పవన్ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. ఇక పవన్ గత రెండు సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. ఓజీ ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తాడా? అది చూడాలి. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
read more news :
Pawan Kalyan: క్రిష్‌తో ఆడుకుంటున్న పవన్ కళ్యాణ్.. ఎందుకిలా చేస్తున్నాడు..!
Pawan Kalyan: పవన్ మాజీ భార్య నందిని ప్రస్తుతం ఏం చేస్తుందో తెలుసా ?