T20 World Cup: కరోనా మహమ్మారి సృష్టించిన ప్రళయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మహమ్మారి వలన సామాన్యులు, ప్రముఖులు కూడా కన్నుమూసారు. కరోనా సమయంలో చాలా మంది నానా రకాల ఇబ్బందులు పడ్డారు. రూల్స్ కూడా చాలా చేంజ్ అయ్యాయి. ముఖ్యంగా క్రికెట్‌లో ప్లేయర్స్ మ్యాచ్‌కి ముందు కొద్ది రోజులు క్వారంటైన్‌లో ఉండాలని ,కరోనా సోకితే మ్యాచ్ ఆడొద్దని, ప్రేక్షకులకి అనుమతి లేదని ఇలా నానా రకాల కండీషన్స్ పెట్టారు. అయితే ఇప్పుడు టీ 20 వరల్డ్ కప్ కోసం ఆ రూల్స్ కొద్దిగా మార్చారు. టీ20 వరల్డ్‌కప్ 2022కి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇప్పటికే కొన్ని రూల్స్‌ని మార్చిన విషయం తెలిసిందే .
కొత్త రూల్స్..
మాన్కడింగ్ (రనౌట్), స్లో ఓవర్ రేట్, కొత్త బ్యాటర్‌కి స్ట్రైక్, బంతికి ఉమ్ము రాయడం, ఫీల్డర్ అసందర్భ కదలికకి పెనాల్టీ తదితర రూల్స్‌లో మార్పులు, చేర్పులు చేయగా, ఇప్పుడు మరో రూల్ కూడా అమలు చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. 2020 నుంచి ఐసీసీ ఈవెంట్లలో కరోనా పాజిటివ్‌గా తేలిన ప్లేయర్లు మ్యాచ్‌లు ఆడడం లేదు.
కరోనా సోకిన ప్లేయర్‌ని టీమ్ డాక్టర్ అనుమతితో మ్యాచ్‌లో ఆడించుకోవచ్చని ఐసీసీ ప్రకటించింది. ఒకవేళ ప్లేయర్ నీరసంగా ఉండి.. అతను మ్యాచ్‌లో ఆడటం సురక్షితం కాదని టీమ్ డాక్టర్ భావిస్తే? రిజర్వ్ ప్లేయర్ నుంచి అతని స్థానంలో మరో ప్లేయర్‌ని టీమ్ ఆడించుకోవచ్చంటూ స్పష్టం చేసింది. ఇక కరోనా సోకిన ప్లేయర్ మ్యాచ్‌లో ఆడితే మాత్రం ఆటగాళ్లు సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అనే ఒక కండీషన్ అయితే పెట్టింది.