Crime News : సోషల్ మీడియా లో పాపులారిటీ కొరకు భార్యాభర్తలు దారుణానికి ఒడిగట్టారు. కన్న బిడ్డనే అమ్మేశారు. ఆ డబ్బుతో హనీమూన్ ఎంజాయ్ చేసేందుకు వెళ్లారు. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళితే… నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని పానిహతి జిల్లా గాంధీనగర్‌కు చెందిన జయదేవ్, సతీ దంపతులకు ఏడేళ్ల కుమార్తె, 8 నెలల కుమారుడు ఉన్నారు. ఈ జంట సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలని కోరుకుంది. అందరిలాగే రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని అనుకున్నారు. కానీ వారి వద్ద స్మార్ట్ ఫోన్ లేదు. కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేదు.
దీంతో కన్న కొడుకును అమ్మకానికి పెట్టారు. ఎనిమిది నెలల కొడుకును రూ.2 లక్షలకు విక్రయించారు. ఆ డబ్బుతో స్మార్ట్ ఫోన్ కొన్నారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. హనీమూన్ కోసం దిఘా మరియు మందరమణి బీచ్‌లతో సహా అనేక ప్రదేశాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు.
అయితే కొద్దిరోజులుగా వారి ఎనిమిది నెలల చిన్నారి కనిపించకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఇరుగుపొరుగు వారు చిన్నారి ఎక్కడ అని అడగ్గా.. అమ్మేశామని జయదేవ్, సతీ తెలిపారు. ఆ డబ్బుతో ఫోన్ కొనుక్కుని చాలా ప్రాంతాలు తిరిగానని చెప్పాడు.
ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దంపతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
also read :
BRO telugu movie review : ‘బ్రో’ తెలుగు సినిమా రివ్యూ
floods in Warangal : కుండపోత వర్షాలు, ప్రాణ నష్టం
gold and silver rates today : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే ?