coronavirus in india : 2020-2021 దేశంలోని ప్రజలంతా లాక్ డౌన్ తో,కరోనా భయంతో ఇళ్లలోనే మగ్గిపోయిన సమయం అది. ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందో తెలీదు. బయట ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం లేదు. అంతా ఆందోళన,భయం. అలాంటి మరువలేని సమయం నుండి ప్రతి ఒక్కరూ ఇప్పుడిప్పుడే పూర్తిగా కొల్కొంటున్న తరుణంలో మళ్ళీ కరోనా విజృంభిస్తోందన్న వార్త అందర్నీ కలవర పెడుతోంది.
అసలు విషయానికి వస్తే చిన్నా చితకా కేసులు తప్ప దేశంలో కనిపించకుండా కనుమరుగైపోతున్న కరోనా మళ్ళీ విజృంభిస్తుందని,అందర్నీ అప్రమత్తంగా ఉండమని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.
అయితే కరోనాకు చెందిన ఇంకో వేరియంట్ చైనాలో ఎవరూ ఊహించంత వేగంగా పాకిపోతుండడంతో అక్కడ ప్రభుత్వం మరో సారి లాక్ డౌన్ ప్రకటించింది.
కాగా అదే కరోనా వేరియంట్ బిఎఫ్-7 ఇండియాలోకి కూడా ప్రవేశించిందని భారత ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే గుజరాత్ లో 2,ఒడిస్సా లో 1 నమోదయ్యాయని ప్రకటించింది.
ఇది ఇలా ఉండగా మరో పక్క క్రిస్మస్,న్యూ ఇయర్ వేడుకలకు ప్రజలు సిద్దమౌతుండడం,ఆ తరువాత సంక్రాంతి పండగ ఉండడంతో కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
దీంతో అప్రమత్తం అయిన కేంద్ర ప్రభుత్వం ప్రజలందరూ బయటకు వచ్చేటప్పుడు మాస్కులు పెట్టుకోవాలని,ప్రతి ఒక్కరూ వ్యక్తిగత దూరం పాటించాలని ప్రజలను కోరింది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించింది.
మరో సారి లాక్ డౌన్ పెడితే దేశం ఆర్థికంగా దెబ్బతింటుందని, ఎవరూ ఊహించని పరిణామాలు ఎదురకోవాల్సి వస్తుందని వెల్లడించింది. ఇక మరో వైపు మొదట్లో వేగంగా సాగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇప్పుడు నత్తనడక నడుస్తుండడంతో వైద్యులు వ్యాక్సినేషన్ పై మళ్ళీ కొత్తగా దృష్టి సారించాల్సిన అవసరం వచ్చింది.
అయితే కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఉద్దేశిస్తూ ఈ కొత్త వేరియంట్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని, నిర్లక్షం చూపకుండా జాగ్రత్త పాటిస్తే సరిపోతుందని వెల్లడించింది.
కానీ ప్రజలు ప్రభుత్వం అందించిన సూచనలను పాటిస్తారా? న్యూ ఇయర్ ఈవెంట్లలో వ్యక్తిగత దూరం వహిస్తారా? సొంత ఊర్లకు మాస్కులు ధరించి జాగ్రత్తగా ప్రయాణిస్తారా? ఇలాంటి ప్రశ్నలకు ఇంకా సమాధానాలు తెలియాల్సి ఉంది.
పోనూ పోనూ ఇంకెన్ని కేసులు పెరుగుతాయో,ప్రభుత్వం నివారణకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది రాబోయే కాలమే తెలుపుతుంది. ఇకపోతే ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండడం మంచింది. ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు.
BF 7 వేరియంట్ పై కొత్త మార్గదర్శకాలు
- అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్‌లను ఉపయోగించాలి.
- సామాజిక దూరం పాటించాలి.
- సబ్బు మరియు నీరు లేదా శానిటైజర్లతో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి.
- వివాహాలు, రాజకీయ లేదా సామాజిక సమావేశాలు మొదలైన బహిరంగ సభలకు దూరంగా ఉండాలి.
- అంతర్జాతీయ ప్రయాణాన్ని నివారించండి.
- జ్వరం, గొంతునొప్పి, దగ్గు, లూజ్ మోషన్స్ మొదలైన ఏవైనా లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి.
- బూస్టర్ డోస్ తో సహా మీ COVID వ్యాక్సినేషన్‌ను వీలైనంత త్వరగా పొందండి.
- కాలానుగుణంగా జారీ చేయబడిన ప్రభుత్వ సలహాను అనుసరించండి.
also read news:
Samantha : సమంత సినిమాలకు నిజంగానే బ్రేక్ పడిందా? మళ్ళీ సినిమాల్లో ఎప్పుడు ?
Taj Mahal : తాజ్ మహల్ చరిత్ర, మీరు తెలుసుకోవలసిన అత్యద్భుత నిర్మాణ విశేషాలు
Water : మన శరీరంలో నీటి అవసరం.. నీరు ఎక్కువైనా, తక్కువైనా వచ్చే సమస్యలేంటి ?