Corn benefits : వర్షాకాలంలో ఎక్కువగా లభించే మొక్కజొన్న మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వర్షం పడుతున్నప్పుడు.. బొగ్గులపై కాల్చిన వేడివేడి మొక్కజొన్న పొత్తుపై కారం, ఉప్పు అద్దుకుని తింటే ఆ కిక్కే వేరుంటుంది.సాధారణంగా మొక్కజొన్నని ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు.
ఇది ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన తృణధాన్యాలలో ఒకటి. మనం ఎక్కువగా పసుపు రంగు మొక్కజొన్నను చూస్తూ ఉంటాం. అయితే ఇది ఎరుపు, నారింజ, ఊదా, నీలం, తెలుపు, నలుపు ఇలా చాలా రంగుల్లో ఉంటుంది. మొక్కజొన్నలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నందున దీనిని క్రమం తప్పకుండా తినడం మంచిది.
మొక్కజొన్నతో బహు ప్రయోజనాలు..
మొక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి1, బి6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో పీచు కూడా పుష్కలంగా ఉన్న నేపథ్యంలో జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది.
ఇది మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్‌ను అరికడుతుంది. ఇందులో మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్ వంటివి కూడా ఉండడంతో ఎముకలు గట్టిపడేలా చేస్తుంది.
కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచటంలో మొక్కజొన్నలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇది శరీరంపై ముడతలు రాకుండా చేస్తుంది.
రక్తహీనత ఉన్నవారికి మొక్కజొన్న ఒక అద్భుతమైన వరం. ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల రక్తహీనతను తగ్గించి ఎర్ర రక్తకణాలని ఎక్కువగా వృద్ది చేస్తుంది. అంతేకాదు కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండెని కాపాడుతుంది.
బ్లాక్స్ కూడా తొలగించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.ఇది తినడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది, కళ్లకు మేలు చేస్తుంది, బరువు కంట్రోల్లో ఉంటుంది, ఐరన్ లోపం దూరమవుతుంది. అల్జీమర్స్‌లో సహాయపడుతుంది