Homebigg boss telugu season 6Bigg Boss 6: ఎమోష‌న‌ల్‌గా సాగుతున్న బిగ్ బాస్ షో... వెట‌కారాలు త‌గ్గించుకోవాలంటూ ఆ కంటెస్టెంట్‌కి చుర‌క‌..!

Bigg Boss 6: ఎమోష‌న‌ల్‌గా సాగుతున్న బిగ్ బాస్ షో… వెట‌కారాలు త‌గ్గించుకోవాలంటూ ఆ కంటెస్టెంట్‌కి చుర‌క‌..!

Telugu Flash News

Bigg Boss 6: బుల్లితెర బిగ్ రియాలిటీ షో గ‌త రెండు రోజులుగా చాలా ఎమోష‌న‌ల్‌గా సాగుతుంది. హౌజ్‌మేట్స్ ఫ్యామిలీ బిగ్ బాస్ హౌజ్‌లోకి రావ‌డంతో కంటెస్టెంట్స్ చాలా ఎమోష‌న‌ల్ అవుతున్నారు. ఫ్యామిలీ వ‌చ్చే స‌మ‌యంలో బిగ్ బాస్ ఫ్రీజ్‌, ఫార్వర్డ్, రివైండ్‌, ఇలా స్నూప్‌ చేయిస్తూ తెగ కామెడీని పండించారు. ఈ గేమ్‌లో ఇంటి సభ్యులు చేసే పనులు ఆద్యంతం సందడిగా సాగడంతోపాటు నవ్వులు కూడా పూయించాయి. బుధవారం ఎపిసోడ్‌ తొలుత ఫైమా తల్లిని పంపించారు. చాలా జోవియల్‌గా ఉండే తన తల్లిని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది ఫైమా. ఆమె అందరితోనూ ఫ్రీగా మాట్లాడారు. తాము ఒకప్పుడు ఎన్నో కష్టాలుపడ్డామని, కానీ ఇప్పుడు నా కూతురు సంపాదిస్తుంటే తాము తింటున్నామని గ‌ర్వంగా చెప్పింది.

ఇక త‌ల్లి ఫైమాకి కొన్ని స‌ల‌హాలు, సూచ‌నుల చేసింది. ఎటకారాలు తగ్గించుకుంటూ కాస్త జెన్యూన్‌గా ఆడాలని తెలిపింది. ఇక పోయే ముందు అందరితో కలిసి డాన్సు చేసింది ఫైమా తల్లి. ఈ డ్యాన్స్ హౌజ్‌లో ఎనర్జీని తీసుకొచ్చింది.ఇక ఫైమా తల్లి వెళ్లిపోయాక శ్రీహాన్‌, శ్రీసత్య కలిసి గార్డెన్‌ ఏరియాలో మాట్లాడుకున్నారు. తమ మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు. అనంతరం శ్రీ సత్య వాళ్ల అమ్మానాన్న రాగా, శ్రీ స‌త్య త‌ల్లికి పక్షవాతంతో కాళ్లు,చేయిపడిపోగా వీల్‌ చైర్ లోనే వ‌చ్చేసింది. శ్రీ సత్యనాన్న త‌న సతీమ‌ణితో హౌజ్‌లోకి వచ్చి ఆమెని సర్‌ప్రైజ్‌ చేశారు. అమ్మని అలా చూసి శ్రీసత్య చాలా భావోద్వేగానికి గురయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంది.

ఇక శ్రీస‌త్య‌కు కూడా ప‌లు సూచన‌లు చేశారు. మొదట్లో చాలా బాగా ఉండేదానివని, ఇప్పుడు ఎటకారాలు కాస్త‌ ఎక్కువయ్యాయి, నడుము తిప్పుడాలు చేస్తున్నావని వాటిని తగ్గించుకుంటే మంచిద‌ని ఆమె తండ్రి స‌ల‌హా ఇచ్చారు. అనంతరం బిగ్‌ బాస్‌ కోచింగ్‌ సెంటర్లు సింగింగ్‌ క్లాస్‌ నిర్వహించారు ఇక చివర్లో రోహిత్ వాళ్ల అమ్మ వచ్చి సర్ప్రైజ్‌ చేసింది. అమ్మని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు రోహిత్‌. మెరీనాతో దిగిన మొదటి సెల్ఫీని సైతం పంపించగా, అదిచూసి, మెరీనాని గుర్తు చేసుకుని రోహిత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే మధ్య మధ్యలో ఫ్రీజ్‌, రివైండ్‌ గేమ్‌తో షోని రక్తికట్టించాడు బిగ్ బాస్.

also read news:

horoscope today : 24-11-2022 గురువారం ఈ రోజు రాశి ఫలాలు తెలుసుకోండి

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News