Telugu Flash News

madhya pradesh : సామూహిక వివాహ వేడుక లో కండోమ్స్ పంపిణీ చేస్తారా ? ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆగ్రహం!

mass marriage event in Madhya Pradesh

mass marriage event in Madhya Pradesh

ఇటీవల మధ్యప్రదేశ్ (madhya pradesh) ప్రభుత్వం నిర్వహించిన సామూహిక వివాహ కార్యక్రమంలో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు పంపిణీ చేయడం కలకలం రేపింది. అధికార బీజేపీది సిగ్గుమాలిన చర్య అని ప్రతిపక్ష కాంగ్రెస్‌ దుయ్యబట్టింది.

ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ముఖ్యమంత్రి కన్యా వివాహ పథకం కింద ఝబువా జిల్లాల్లో ఇటీవల సామూహిక వివాహ వేడుక జరిగింది. అందులో 283 జంటలు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం నూతన వధూవరులకు పెళ్లి పెట్టెలను బహూకరించారు. మేకప్ బాక్స్‌లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు ఉండడంతో వధూవరులు షాక్‌కు గురయ్యారు. బాక్సులపై నేషనల్ హెల్త్ మిషన్ స్టిక్కర్లు కూడా అతికించారు.

వివాహ కార్యక్రమంలో జరిగిన ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అధికార బీజేపీ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ పెద్దలు ఇలాంటి సిగ్గుమాలిన పనికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడం కరెక్టే కానీ , అయితే ప్రతి పనికి సమయం, సందర్భం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

కాగా, జరిగిన ఈ ఘటనపై తాండ్ల ఎస్‌డీఎమ్ తరుణ్ జైన్ వివాహ కార్యక్రమంలో ఇలా స్పందించారు. అవి మేకప్ కిట్‌లు కావని, కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘నయే పహల్’ కిట్‌లని స్పష్టం చేసేందుకు ప్రయత్నించారు.

read more news :

Work from office | వారానికి మూడు రోజులు రావాల్సిందే : టీసీఎస్ హెచ్చరిక

 

Exit mobile version