Telugu Flash News

Common Point: డ‌బుల్ సెంచ‌రీ కొట్టిన ఈ బ్యాట్స్‌మెన్‌లో ఉన్న కామ‌న్ పాయింట్ ఏంటో తెలుసా?

Common Point: ఒక‌ప్పుడు సెంచ‌రీ చేయాలంటేనే బ్యాట్స్‌మెన్స్ కి చాలా గ‌గ‌నం. బౌల‌ర్స్ ప‌దునైన బంతులకి ప‌రుగులు రాబ‌ట్ట‌లేక నానా ఇబ్బందులు ప‌డేవారు. అయితే ఎప్పుడైతే టీ20 ఫార్మాట్ మొద‌లైందో ప‌రుగుల వ‌రద పారించ‌డం మొద‌లు పెట్టారు. బౌల‌ర్స్ కి చుక్క‌లు చూపిస్తూ అల‌వోక‌గా ప‌రుగులు రాబ‌డుతున్నారు. కుర్ర బ్యాట్స్‌మెన్స్ సైతం అల‌వోక‌గా డ‌బుల్ సెంచరీలు కొడుతున్నారు. వ‌న్డేల్లో డబుల్ సెంచరీ కొట్టిన అందరు బ్యాట్స్‌మెన్ పేర్లలో ‘A’ అనే ఆంగ్ల అక్షరం కామన్‌గా ఉండటంతో ఇందుకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. ద్విశతక వీరులైన రోహిత్ శర్మ, మార్టిన్ గుప్తిల్, వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, ఫకర్ జమాన్, ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్, సచిన్ టెండూల్కర్.. ఇలా ఈ లిస్టులో ఉన్న 8 మంది క్రికెటర్ల పేర్లలో ‘A’ లెటర్ కామన్‌గా ఉంది.

న్యూజిలాండ్‌తో మంగళవారం ఉప్పల్‌లో జరిగిన తొలి వన్డేలో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే. 149 బాల్స్ లో 208 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డునూ అతడు అందుకున్నాడు. . ఈ మ్యాచ్‌లో టీమిండియా 12 పరుగుల తేడాతో క‌ష్టం మీద విజయం సాధించింది. ఈ నేపథ్యంలో డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్ల లిస్టులో కామన్‌గా ఉన్న విషయాలను నెటిజన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తద్వారా క్రికెట్‌లోనూ సెంటిమెంట్స్ కామన్ అంటూ నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నారు.

నిజానికి ఓవెల్స్‌లో ఒక క్యారెక్టర్ అయిన ‘A’ చాలా పేర్లలో కామన్‌గానే ఉంటుంది. కానీ.. ఇప్పుడు దాన్ని సెంటిమెంట్‌గా మార్చేసి.. క్రికెట్ లవర్స్ కొత్త సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకురావడం కాస్త విచిత్రంగానే అనిపిస్తోంది. అయితే ఇప్ప‌టి వర‌కు డ‌బుల్ సెంచ‌రీలు చేసిన బ్యాట్స్‌మెన్స్‌లో రోహిత్ శ‌ర్మ త‌ప్ప ప్ర‌తి ఒక్క‌రు ఒక్క డ‌బుల్ సెంచరీ మాత్ర‌మే చేశారు. రోహిత్ శ‌ర్మ మాత్ర‌మే మూడు డ‌బుల్ సెంచ‌రీలు చేసి ఎవ‌రికి అందనంత ఎత్తులో నిలిచాడు.

Exit mobile version