Viral Video: ఇప్పుడు జనాలు క్రికెట్‌కి బాగా అలవాటు పడ్డారు. ఇండియా మ్యాచెస్ ఉంటే ఆ రోజు సెలవు పెట్టి మరీ మ్యాచ్ చూసే వాళ్లు కూడా ఉన్నారు. ఇంక పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే హంగామా ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. అయితే ఛానెల్స్ వాళ్లు కూడా వీక్షకులకి సరికొత్తదనం అందించేందుకు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు సాధారణంగా క్రికెట్ కామెంటరీ అంటే ఒకప్పుడు స్టేడియంలో ప్రత్యేకంగా ఉన్న ఓ బాక్స్‌లో కూర్చొని చెప్పేవారు . కానీ ఇప్పుడలా కాదు. బౌండరీ బయట డగౌట్ దగ్గర, ప్రేక్షకుల్లో, ఒక్కోసారి ఫీల్డ్‌లో ప్లేయర్ వెనుక నిల్చొని కూడా కామెంటరీ చేసిన సందర్భాలను మనం గమనిస్తూనే ఉన్నాం.
ఇదేమి చోద్యం..
తాజాగా టీ20 వరల్డ్‌కప్‌లో జరిగిన మ్యాచ్‌లో ఓ మహిళా కామెంటేటర్ ఏకంగా స్టేడియం రూఫ్‌టాప్‌పైకి ఎక్కేసింది. అక్కడి నుంచి మ్యాచ్‌ను చూస్తూ కామెంటరీ ఇచ్చింది. నటాలీ జెర్మానోస్ అనే ఆ కామెంటేటర్ పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ స్టంట్ చేయగా, ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీతోపాటు టీ20 వరల్డ్‌కప్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లలో షేర్ చేశారు. ఇది చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవడమే కాకుండా ఆగ్రహం కూఆ వ్యక్తం చేస్తున్నారు. కిందపడితే ఏమైన ఉందా అంటూ ఆమెని నోటికొచ్చినట్టు తిట్టిపోస్తున్నారు.
అయితే స్టేడియం టాప్‌లో నిల్చొని మ్యాచ్ చూస్తుంటే కలిగే అనుభూతిని వివరించింది. ఆమె వెనుక ఉన్న కెమెరామ్యాన్ ఆ అద్భుతాన్ని ప్రేక్షకులకు కూడా చూపించాడు. క్రికెట్ మ్యాచ్ చూడటానికి బెస్ట్ సీట్ ఇదే అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను ఐసీసీ షేర్ చేసింది. ఈ వీడియోను ఆదివారం (అక్టోబర్ 30) షేర్ చేయగా.. ఇప్పటికే 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకూ ఎప్పుడూ చూడని కామెంటరీ అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, అద్భుతాలు బాగానే చేస్తున్నారని వివరించాడు. మొత్తానికి ఈ వీడియో తెగ హల్చల్ చేస్తుంది.