Homehealthకాఫీ ఎక్కువసార్లు తాగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందా ? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

కాఫీ ఎక్కువసార్లు తాగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందా ? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

Telugu Flash News

మీరు ప్రతిరోజూ కాఫీ (coffee) కోసం ఆరాటపడుతున్నారా? అయితే మీకొక శుభవార్త. ఈ సరికొత్త అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ ఎక్కువసార్లు కాఫీ తాగేవారికి ప్రోస్టేట్ క్యాన్సర్ (prostate cancer) వచ్చే ప్రమాదం తక్కువ అంటున్నారు.

జర్నల్ బి ఎం జెడ్ ఓపెన్ అనే పత్రిక లో ప్రచురణ అయిన ఈ అధ్యయనంలో ప్రతిరోజూ ఒక అదనపు కప్పు బ్రు తీసుకోవడం వలన దాదాపు 1 శాతం ప్రమాదం తగ్గే అవకాశాలు కనిపించాయి.

ఒక అధ్యయనం ప్రకారం ఎక్కువ కప్పుల కాఫీ త్రాగడం వలన ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కాఫీ త్రాగడం వలన కాలేయం, ప్రేగు మరియు రొమ్ము క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు కూడా బాగా తక్కువ.

చైనా మెడికల్ యూనివర్సిటీలో ఉన్న యూరాలజీ విభాగానికి చెందిన జియోనాన్ చెన్ మరియు ఈ అధ్యయనాన్ని చేసిన ఇతర పరిశోధకుల ప్రకారం ” కాఫీ తీసుకోవడం పెరగడానికి  ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుదలకు సంబంధం ఉండచ్చు అని ఈ అధ్యయనం సూచిస్తుంది”

పురుషులకు ఎక్కువగా సోకే క్యాన్సర్ లో ప్రోస్టేట్ క్యాన్సర్ రెండవ స్థానంలో ఉంది మరియు పురుషుల్లో  క్యాన్సర్ కారక మరణాల్లో ఆరవ స్థానంలో ఉంది.

ప్రతి నాలుగు కేసుల్లో మూడు కేసులు అభివృద్ధి చెందిన దేశాల్లోనే నమోదు అవుతున్నాయి, 1970ల నుండి ఆసియా దేశాలలో అంటే జపాన్, సింగపూర్ మరియు చైనా వంటి దేశాలలో కూడా పెరుగుతున్నాయి.

సమస్య యొక్క ముందస్తు అవగాహన కోసం, పరిశోధకులు సెప్టెంబర్ 2020 వరకు ప్రచురింపబడిన సంబంధిత సమన్వయ అధ్యయనాల పరిశోధన డేటాబేస్ గాలించి అధ్యయనం చేసారు.

-Advertisement-

ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం  16:15 ఎక్కువ నుండి తక్కువ కాఫీ తీసుకునేవారి సమాచారాన్ని తీసుకున్నారు. 13 మంది అదనపు కప్పు తీసుకోవడం వలన అనుసంధానమైన ప్రమాదాన్ని రిపోర్ట్ చేసారు.

రోజుకి 2 నుండి 9 కప్పులు కాఫీ తీసుకునేవారిని అత్యధిక స్థాయి క్రింద; తక్కువ స్థాయి అంటే రోజుకి 2 నుండి అసలు కాఫీ తీసుకోని వారి క్రింద విభజించారు. నార్త్ అమెరికా(7), యూరోప్(7) మరియు జపాన్(2) లో చేసిన అధ్యయనాలను కూడా కలిపి పరిశీలించారు.

ఈ అధ్యయనంలో కనీసం పది లక్షలమంది పురుషులు  (1,081,586) అందులో 57,732 మంది ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడినవారు ఉన్నారు.

కాఫీ తక్కువగా తీసుకునేవారితో పోల్చితే ఎక్కువగా తీసుకునేవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 9 శాతం తగ్గే అవకాశం ఉంది. ప్రతి అదనపు కప్పు ఒక శాతం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

కాఫీ తీసుకోవడం వలన కాలేయం, ప్రేగు మరియు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాలు కూడా తగ్గే  అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు కానీ ప్రస్తుతానికి, కాఫీ త్రాగడం వలన ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గించే విషయంలో రుజువు ఉన్నట్టు వాటికీ లేదు.

ఇవి కూడా చదవండి :

Priya Prakash Varrier: పెళ్లైన హీరోపై మ‌న‌సు పారేసుకున్న ప్రియా ప్రకాశ్..

Dhoni: చిన్నారి ప్ర‌శ్న‌కు న‌వ్వేసిన ధోని.. ఇంత‌కు ఆమె ఏ ప్ర‌శ్న‌ అడిగిందంటే..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News