CM KCR : ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో రెండు ప్రత్యేక బస్సులు, 600 వాహనాలతో కూడిన భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మహారాష్ట్రలోని ధరాశివ్ జిల్లాలోని ఒమర్గా చేరుకుంటారు. ఓమర్గాలో భోజనం చేసి సాయంత్రం 4.30 గంటలకు షోలాపూర్‌కు బయలుదేరుతారు. షోలాపూర్‌లో రాత్రి బస చేస్తారు. మంగళవారం ఉదయం 8 గంటలకు షోలాపూర్ నుంచి పండరీపురం చేరుకుంటారు.
పండరీపురంలోని విఠోభరుక్మిణీ మందిరంలో సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత షోలాపూర్ జిల్లా సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సభలో షోలాపూర్ జిల్లాకు చెందిన ప్రముఖ నేత భగీరథ్ బాల్కేతోపాటు పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ ఎస్ లో చేరనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ధారశివ్ జిల్లాలోని శక్తిపీఠం తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హైదరాబాద్‌కు చేరుకుంటారు. సీఎం కేసీఆర్ పర్యటనకు మహారాష్ట్రలోని బీఆర్ఎస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సందర్భంగా 2003 మార్చి 27న ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమానికి కేసీఆర్ పిలుపునిచ్చి,హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు భారీ కార్ల ర్యాలీ చేపట్టి యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ జోరందుకుంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సమయంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మహారాష్ట్రలో పర్యటించేందుకు కేసీఆర్ ఎంచుకున్న రహదారి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
600 వాహనాలతో కూడిన భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రలోని షోలాపూర్‌కు బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్
BRS President and Chief Minister Sri K Chandrashekhar Rao left for Solapur in Maharashtra by road from Pragathi Bhavan today.#BRSparty #CMKCR pic.twitter.com/OnevBKSI2n
— BRS News (@BRSParty_News) June 26, 2023
మహారాష్ట్రలో BRS పార్టీ సంస్థాగతంగా గ్రౌండ్లో మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో రెండు రోజుల పర్యటనకు భారీ కాన్వాయ్ తో రోడ్డు మార్గంలో మహారాష్ట్రకు బయలుదేరిన సీఎం కేసీఆర్….#CMKCR #BRS #Maharatsra pic.twitter.com/bF9IoFazPE
— పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA) June 26, 2023
read more news :
Drugs Case : టాలీవుడ్ లో కలకలం.. స్పందించిన ఆషూ రెడ్డి, జ్యోతి, సురేఖావాణి