Homehealthcloves benefits : ల‌వంగాలు తింటే ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా?

cloves benefits : ల‌వంగాలు తింటే ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా?

Telugu Flash News

cloves benefits : లవంగం మ‌నం ప్ర‌తి వంట‌కంలో త‌ప్ప‌క ఉప‌యోగిస్తుంటాం అనే సంగ‌తి తెలిసిందే. ల‌వంగం రుచికి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేకూరుస్తుంది. జనరల్‌గా లవంగాల్ని వంటల్లో, మాంసం కూరల్లో, బిర్యానీ తయారీలో వేస్తారు .

లవంగాల్ని కూరలతోపాటూ..కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎక్కువగా వాడతార‌నే విష‌యం తెలిసిందే. . ఈ పువ్వుల వల్ల మన పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. లవంగాల్ని పొడిగా చేసి దెబ్బతిన్న దంతం దగ్గరా, పాడైన చిగుళ్ల దగ్గరా పెట్టుకుంటే అది మంచి ఔష‌దంలా ప‌ని చేస్తుంది.

త‌క్కువ తీసుకుంటే మంచిది..

శరీరంలోని వేడి ఎక్కువగా ఉంటే నోటి దుర్వాసన త‌ప్ప‌క వ‌స్తుంది. అందుకే దానిని అరికట్టాలంటే రెండు, మూడు లవంగాలు నోట్లో వేసుకొని మెల్లగా నములుతూ ఉంటే క్ర‌మ‌క్ర‌మంగా నోటి దుర్వాసన పోతుంది.

ఆహారం జీర్ణం కాక వామ్టింగ్ వస్తున్నట్లు అనిపించిన‌ప్పుడు ఓ రెండు లవంగాలు నోట్లో వేసుకుంటే చాలు. ఆహారం జీర్ణమూ అవుతుంది. వికారం లాంటివీ కూడా ద‌రి చేర‌వు.

రోజుకు ఐదారు లవంగాల్ని చప్పరిస్తే ముక్కు సమస్యలు తొలగిపోతాయి. లివర్, స్కిన్ సమస్యల్ని తగ్గిస్తాయి. అంతేకాదు లవంగాల్లో యూజెనాల్ అనే నూనె ఉంటుంది. అది నొప్పి, వాపు, మంటల్ని త‌ప్ప‌క త‌గ్గిస్తాయి..

పొట్టలో అల్సర్ సమస్యలకు కూడా లవంగాలు విరుగుడుగా ప‌ని చేసి మ‌న ఆరోగ్యం మంచిగా ఉండేలా చేస్తాయి. లవంగాలు కేన్సర్ అంతు కూడ చూస్తాయి బరువు తగ్గడానికి కూడా ఇవి సహకరిస్తాయి.

-Advertisement-

మన శరీర ఎముకలు బలంగా ఉండాలంటే లవంగాలు తినాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. లవంగం వ‌ల‌న కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి.

లవంగాల్ని అదే పనిగా నోట్లో పెట్టుకుంటే నోరు పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి రోజుకు నాలుగైదు మించకుండా తినాలి. ల‌వంగాలు మోతాదు ఎక్కువైతే కీడు చేస్తాయి కూడా.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News