Tarun: టాలీవుడ్‌లో చాలా మంది మోస్ట్ సీనియర్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్నారు. ఇందులో కొందరు మెల్లమెల్లగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ప్రభాస్, తరుణ్ వంటి వారు ఇంకా బ్యాచిలర్ జీవితాన్నే గడుపుతున్నారు. అయితే ప్రభాస్ కన్నా కూడా తరుణ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పాలి. ప్రస్తుతం తరుణ్ పెద్దగా సినిమాల్లో నటించడం లేదు.. కనుక ఆయన పెళ్లి గురించి పెద్దగా మీడియాలో అంత ప్రచారం అయితే జరగడం లేదు. ప్రభాస్ తో పోల్చితే తరుణ్ పెళ్లి గురించి ఎక్కువ వార్తలు రావాల్సి ఉన్నా పెద్దగా హైలైట్ కావడం లేదు. తరుణ్ యంగ్ ఏజ్‌లోనే స్టార్ స్టేటస్‌ను పొందాడు. లవర్ బాయ్‌గా అమ్మాయిలు హృదయాలను దోచుకున్నాడు. అయితే సడెన్‌గా ఆయనని విజయాలు వరించడం మానేశాయి. దీంతో సినిమాలకు కాస్త విరామం ఇచ్చి వ్యాపార రంగంలో బిజీ అయిపోయాడు. . అయితే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్స్ లో ఒక్కడైన తరుణ్.. పెళ్లిపై పలు ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆమె తల్లి, ప్రముఖ నటి రోజారమణి తాజాగా క్లారిటీ ఇచ్చారు.
తరుణ్ కన్నా కూడా ఆయన తల్లి రోజా రమణి రెగ్యులర్ గా మీడియాలో కనిపిస్తూ ఉంటారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన కొడుకు కెరీర్ గురించి మరియు వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నటనలో తరుణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా చెప్పిన ఆమె పెళ్లి కూడా త్వరలో చేసుకుంటాడు అని చెప్పుకొచ్చింది. తరుణ్ కి దైవ భక్తి చాలా ఎక్కువ, ప్రతి ఏడాది తిరుమలకు వెళ్తారని చెప్పారు . మళ్లీ కెరీర్ లో నిలదొక్కుకునేందుకు తరుణ్ రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్, సినిమాకి కమిట్ అయ్యాడు. ఇందులో ఏది ముందు మొదలవుతుందో చెప్పడం కష్టం. తాను కూడా మంచి సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నానని, తన కుమారుడు పెళ్లి చేసుకోవాలని, అన్ని బాగుండాలని ఆశిస్తున్నట్టు రోజారమణి అన్నారు. తన చేతుల మీదుగా ఎంతో మందికి పెళ్లిళ్లు చేశానని, ఆ ఆశీర్వాదాలు తనకు కుమారుడి దక్కుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొంది
మనసు, మమతతో బాలనటుడిగా సినిమా పరిశ్రమకు పరిచయమ్యాడు తరుణ్. అమ్మ, నాన్నల నుండి నటనను వారసత్వంగా తీసుకున్న తరుణ్.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాలు చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు.. అంజలి, సూర్య ఐపిఎస్, తేజ, ఆదిత్య 369, వజ్రం వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్.. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ సినిమాల్లో కూడా సందడి చేశారు. మారి నువ్వే కావాలి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన తరుణ్ స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రియమైన నీకు, నువ్వులేక నేను లేను, నువ్వే నువ్వే సినిమాలతో స్టార్ హోదాను సంపాదించుకొని ఓ వెలుగు వెలిగారు. అయితే ఆ తర్వాత భలే దొంగలు, ఎలా చెప్పను, సోగ్గాడుతో పలు పలు సినిమాలు బాక్సాఫీసు ముందు బోల్తా కొట్టడంతో సినిమాలు తగ్గించాడు.