HomeSpecial StoriesIAS Success Story: ఆ అలవాట్లే నన్ను ఐఏఎస్ అయ్యేలా చేశాయి..

IAS Success Story: ఆ అలవాట్లే నన్ను ఐఏఎస్ అయ్యేలా చేశాయి..

Telugu Flash News

IAS Success Story: ఐఏఎస్ కొట్టడం అనేది చాలా మందికి జీవితాశయం. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌లో ఏదో ఒకటి కొట్టినా చాలని చాలా మంది పరితపిస్తుంటారు. ఈ దిశగా లైఫ్‌ సెటిల్‌ చేసుకోవాలనుకొనే వారు చాలా మంది ఉంటారు. అయితే, సివిల్‌ సర్వీసెస్‌ పాస్‌ కావడం అంత తేలికైన విషయం కాదు. కేవలం కొంత మందికి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుంటుంది. అలా కొద్ది మందిలో ఒకరయ్యారు ఆదిత్య సింగ్‌. చిన్న వయసులోనే చాలా కష్టపడి చదివి ఐఏఎస్ వైపుగా పయనం సాగించి అందులో విజయవంతం అయ్యారు.

ఆదిత్య సింగ్ బీటెక్ చ‌దివారు. ఐబీఎంలో ఉద్యోగం చేశారు. సివిల్స్ వైపుగా ప్రయాణం చేసి జాతీయ స్థాయిలో 92వ ర్యాంకు సాధించడం విశేషం. ఇక ఐఏఎస్ కేడర్ సొంతం చేసుకోబోతున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌కి చెందిన ఆదిత్య సింగ్.. చిన్ననాటి నుంచే చదువులో చలాకీగా ఉండేవారు. తండ్రి జితేంద్ర కుమార్, తల్లి పవిత్రా సింగ్. ఆదిత్యసింగ్‌కు అక్కా చెల్లెళ్లు నేహా సింగ్, రాశి సింగ్ ఉన్నారు. ఆదిత్య సింగ్.. తన ప్రాథమిక విద్యను ముజఫర్‌నగర్‌లోని ఎంజీ పబ్లిక్ పాఠశాలలో చదివారు.

ఇంట‌ర్ విద్యను ముజఫర్‌నగర్‌లోనే పూర్తి చేసిన ఆదిత్య సింగ్.. నోయిడాలోని జేఎస్ఎస్ అకాడమీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. బీటెక్ అనంతరం బెంగళూరులోని ప్రఖ్యాత ఐటీ కంపెనీ ఐబీఎం దాదాపు ఏడాదిన్నర పాటు కొలువు చేశాడు. అలా ఐటీ ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ కొలువు కోసం పోటీ పడాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఉద్యోగాన్ని వదులుకోలేదు. జాబ్‌ చేస్తూనే.. యూపీఎస్సీకి సన్నద్ధం కాసాగాడు. ఇలా రెండుసార్లు యూపీఎస్సీ కోసం సిద్ధమయ్యాడు. కానీ లక్‌ అతని తలుపు తట్టలేదు.

ఈ నేపథ్యంలో మరింత కసిగా ఉద్యోగం మానేసి ట్రై చేశాడు. ఈ సమయంలోనే ఇంటర్వ్యూ దాకా వెళ్లాడు. అయితే, అప్పుడు కూడా కానీ కొన్ని మార్కులు తక్కువగా రావడంతో మూడోసారి కూడా ఫెయిలయ్యాడు. ఇక నాలుగోసారి తీవ్రంగా కృషి చేసి పట్టుదలతో ప్రయత్నించాడు. చివరకు విజయం అతని సొంతమైంది. ఐదో ప్రయత్నంలో యూపీఎస్సీ సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 92వ ర్యాంకు సాధించాడు. ఐఏఎస్ కేడర్ సొంతం కాబోతోంది. ప్రతి పరిస్థితిలోనూ తన కుటుంబం తనకు అండ‌గా ఉంటూ వచ్చిందని ఆదిత్య సింగ్‌ పేర్కొంటున్నాడు.

Read Also : Spirituality: పూజ తర్వాత హారతి.. ఆంతర్యం ఏమిటో తెలుసా?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News