Telugu Flash News

Chris Gayle: కుంబ్లేపై క్రిస్ గేల్ సంచ‌ల‌న కామెంట్స్… ఆయ‌న వ‌ల్ల‌నే నేను ఇలా….!

Chris Gayle: మ‌రి కొద్ది రోజుల‌లో ఐపీఎల్ హంగామా మొద‌లు కానుంది. భారీ రేట్ల‌తో కొన్ని జ‌ట్లు పాపుల్ క్రికెట‌ర్స్‌ని ద‌క్కించుకుంది. అయితే  ప్రతీ సీజన్‌కి ముందు కెప్టెన్‌ని మార్చడం పంజాబ్ కింగ్స్‌కి బాగా అలవాటు గా మారింది. ఈసారి కెప్టెన్‌తో పాటు హెడ్ కోచ్‌ని కూడా మార్చేసి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.నాలుగేళ్లుగా పంజాబ్ కింగ్స్‌కి హెడ్ కోచ్‌గా ఉన్న అనిల్ కుంబ్లేని తప్పించి, ట్రేవర్ బేలిస్‌కి బాధ్యతలు అప్పగించింది ప్రీతి జింటా టీమ్. 2019 అక్టోబర్ నుంచి పంజాబ్ కింగ్స్‌కి హెడ్ కోచ్‌గా, క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నాడు భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే. కుంబ్లే కోచింగ్‌లో వరుసగా నాలుగు సీజన్లలో ఆరో స్థానంలో నిలిచింది పంజాబ్ కింగ్స్.

టీమిండియాకి హెడ్ కోచ్‌గా వ్యవహరించిన సమయంలో అనిల్ కుంబ్లేకి, అప్పటి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో విభేదాలు త‌లెత్తిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అలాంటి ఆరోపణలే చేశాడు వెస్టిండీస్ ఆటగాడు, పంజాబ్ కింగ్స్ మాజీ బ్యాటర్ క్రిస్ గేల్. ‘ఐపీఎల్ టైటిల్ గెలవడానికి కావాల్సిన అదృష్టం నాకు లేదనుకుంటా… ఇంతకంటే ఏం చెప్పాలి!’ అంటూ వ్యాఖ్యానించాడు క్రిస్ గేల్. గేల్ పక్కన కూర్చున్న అనిల్ కుంబ్లే వెంటనే… ‘అవును… నాది కూడా సేమ్ సీన్’ అంటూ కామెంట్ చేశాడు. అనిల్ కుంబ్లే చేసిన కామెంట్లపై వెంటనే స్పందించిన క్రిస్ గేల్… ‘నాకు కొన్ని సార్లు అదృష్టం కలిసి రాలేదు. అయితే అనిల్ కుంబ్లే ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌లో లేడు. అతను టీమ్‌లో ఉన్నప్పుడు నన్ను రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టాడ‌ని చెప్పుకొచ్చాడు.

న‌న్ను జట్టులో నుంచి తీసేశాడు. అందుకే పంజాబ్ కింగ్స్ అతన్ని తీసేసి, నా పక్కన కూర్చోబెట్టింది. నాకు తగిన గౌరవం దక్కి ఉంటే ఈ పాటికి ఇద్దరం ఐపీఎల్ టైటిల్ గెలిచేవాళ్లమేమో…’ అంటూ కామెంట్ చేయ‌గా, ఈ మాటకు ఏం చెప్పాలో తెలియక నవ్వేసి ఊరుకున్నాడు అనిల్ కుంబ్లే. కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ తరుపున 2020, 2021 సీజన్లు ఆడాడు క్రిస్ గేల్. అయితే ఈ రెండు సీజన్లలో క్రిస్ గేల్‌కి తుదిజట్టులో చోటు దక్కిన మ్యాచుల కంటే రిజర్వు బెంచ్‌లో కూర్చున్న మ్యాచుల సంఖ్యే ఎక్కువ అని చెప్పాలి.. ఈ కారణంగానే 2021 సీజన్ మధ్యలో నుంచి తప్పుకున్న క్రిస్ గేల్.. ‘తనకి ఐపీఎల్‌లో దక్కాల్సిన గౌరవం దక్కలేదు’ అంటూ కీల‌క‌ వ్యాఖ్యలు చేశాడు.

Exit mobile version