Rakesh Master Passed Away : తెలుగు చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ (53) మృతి చెందారు. ఈయన అసలు పేరు ఎస్.రామారావు. గత కొంత కాలంగా రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే విజయనగరం నుంచి వస్తుండగా రాకేష్ మాస్టర్‌కు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రక్తస్రావమై వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ మృతి చెందాడు.
సోషల్ మీడియా నెటిజెన్స్ కి రాకేష్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాకేష్ మాస్టర్ అటా డ్యాన్స్ షోతో డాన్సర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. హైదరాబాద్‌లోని ముక్కురాజు మాస్టర్ వద్ద పనిచేసిన రాకేష్ మాస్టర్ ఆ తర్వాత లాహిరి లాహిరి లాహిరి, దేవదాసు, చిరునవ్వు, సీతయ్య, అమ్మో పోలీసోల్లు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. దాదాపు 1500 చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. టాలీవుడ్‌లో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్‌లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్‌లు ఆయన శిష్యులే! స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసిన ఘనత ఆయనది.
రాకేష్ మాస్టర్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు. చాలా మంది డ్యాన్స్ మాస్టర్ల వల్ల తన కెరీర్ నాశనం అయిందని యూట్యూబ్‌లో చాలా ఫేమస్ అయ్యాడు. దీంతో ఆయన మాట్లాడిన ప్రతి మాట వైరల్‌గా మారింది. యూట్యూబ్ ఇంటర్వ్యూలో రాకేష్ మాట్లాడుతూ తనకు గేమ్ షోలు, డ్యాన్స్ షోలు అంటే ఇష్టమని, అందుకే రాకేష్ మాస్టర్ మూడ్ బాగోలేక ఇలా మాట్లాడుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన మరణవార్తతో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
read more :
Andhra Pradesh News : ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు
manappuram gold loan : మణప్పురం ఫైనాన్స్‌కు ఆర్‌బీఐ భారీ జరిమానా!