అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన చిరంజీవి మెగాస్టార్‌గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. నటుడిగనే కాదు సామాజిక కార్యక్రమాలు చేయడం ద్వారా చిరు అందరి మనసులు గెలుచుకున్నారు. చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో మంచి సినిమాలు చేశారు. ఎంతో మంది డైరెక్టర్స్‌తో కలిసి పని చేశారు. అయితే తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి- కోదండరామిరెడ్డిలది అద్భుతమైన జోడి అని చెన్నాలి. వీరిద్దరూ కలిసి సృష్టించిన అద్భుతాలు, నెలకొల్పిన రికార్డులు చాలా ఉన్నాయి. చిరంజీవిని మాస్ హీరోగా నిలబెట్టిన చిత్రాలు, స్టార్ డమ్ తెచ్చిపెట్టిన చిత్రాలన్నింటికీ ఏ కోదండరామిరెడ్డినే దర్శకత్వం వహించడం విశేషం.
ఖైదీ, అభిలాష, గూండా, దొంగ, ఛాలెంజ్, విజేత, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, ముఠామేస్త్రి… వంటి ఇండస్ట్రీని షేక్ చేసిన చిత్రాలు ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలోనే రూపొందాయి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం, అభిమానం ఉండేది.
అయితే అప్పట్లో వీరిద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందనే దానికి ఈ ఫోటోనే ఉదాహరణ. 1984లో రుస్తుం మూవీ షూటింగ్ అవుట్ డోర్ లో నడుస్తుండగా, షూటింగ్ గ్యాప్ లో ఏ కోదండరామిరెడ్డి సిగరెట్స్ తీసుకొచ్చి ఒకటి తాను తీసుకొని మరొకటి చిరంజీవికి ఇచ్చారు. అయితే స్వయంగా ఆయనే చిరంజీవి సిగరెట్‌కి వెలిగించడం విశేషం. ఈ తతంగాన్ని ఆ చిత్ర హీరోయిన్ ఊర్వశి ఆసక్తిగా చూడటం మనం గమనించవచ్చు.
ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది . ముఠామేస్త్రి తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్ లో మూవీనే రాలేదు. బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో చిత్రాలు చేసిన కోదండరామిరెడ్డి చిరంజీవితో మాత్రం సినిమాలు తెరకెక్కించలేదు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని ప్రచారం జరిగింది. అవన్నీ అవాస్తవాలు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కోదండ రామిరెడ్డి. దర్శకుడిగా కోదండరామిరెడ్డి చివరి చిత్రం పున్నమి నాగు(2009) అనే విషయం తెలిసిందే.
also read news: