Telugu Flash News

Chiranjeevi: వేణు నువ్వు ఇలాంటి షాకులిస్తే ఎలా చెప్పు.. చిన్న ఆర్టిస్ట్‌ని ఆకాశానికి ఎత్తిన చిరు

Chiranjeevi: క‌మ‌ర్షియ‌ల్ నిర్మాత బ్యాన‌ర్‌పై హ‌ర్షిత్‌, హ‌న్షిత నిర్మించిన చిత్రం ‘బలగం’. కమెడియన్, జబర్దస్ యాక్టర్ అయిన వేణు ఎల్దండి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాగా, ఇందులో తెలంగాణ సంస్కృతి, తెలుగువారి ఎమోష‌న్స్‌ను క్యారీ చేస్తూ మూవీని అద్భుతంగా తెర‌కెక్కించాడు.

మార్చి 3న విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించిన ఈ చిత్రం సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీ ప్ర‌శంస‌లు పొందుతుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘బలగం’ టీమ్‌ను అభినందిస్తూ ప్ర‌శంస‌లు కురిపించారు.

భోళా శంక‌ర్ షూటింగ్ స‌మ‌యంలో బిజీగా ఉండ‌టంతో బ‌ల‌గం టీమ్ అక్క‌డ‌కు చేరుకోగా, ద‌ర్శ‌కుడు వేణు ఎల్దండితో పాటు హీరో ప్రియద‌ర్శి, హీరోయిన్ కావ్యా క‌ళ్యాణ్ రామ్‌, నిర్మాత దిల్ రాజు త‌దిత‌రులని చిరంజీవి ప్ర‌త్యేకంగా అభినందించారు.

డైరెక్టర్ వేణు చిరంజీవికి పాదాభివంద‌నం చేసి ఆశీస్సులు తీసుకున్నాడు. ఇక చిరు.. వేణుని ప్ర‌శంసిస్తూ.. ఏం వేణు ఇలా సడెన్‌గా మంచి సినిమా తీసి షాకులిస్తే ఎలా , నేను సినిమాను చూశా. చాలా బాగుంది. దిల్ రాజు వంటి క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ ఉన్న‌ప్ప‌టికీ సినిమాను చాలా స‌హ‌జంగా చిత్రీక‌రించావ‌ని మెగాస్టార్ ప్ర‌శంస‌లు కురిపించారు.

also read :

Shriya Saran You And I Magazine Photoshoot Photos 2023

samyuktha menon Latest stills, Images, Photos 2023

 

Exit mobile version