Chiranjeevi: ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి (megastar chiranjeevi) నటించిన చిత్రం గాడ్ ఫాదర్ (godfather) . ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా విడుదల కానున్న ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాలో పొలిటికల్ యాక్షన్ సీన్స్ తో పాటు ఫ్యామిలీ సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తుంది. అయితే అక్టోబర్ 5న చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ చేశారు. అనంతపురం వేదికగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వేలాది మంది అభిమానులు వచ్చారు.
మెగాస్టార్ స్పీచ్ అదరగొట్టేశాడు..
అయితే ఎంతో కలర్ ఫుల్ గా జరగాల్సిన ఈ ఈవెంట్ వర్షార్పణం అయ్యింది. వేరే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండడం వలన చిరంజీవి కాస్త లేటుగా వచ్చారు.
ఆయన వచ్చిన కొద్ది సేపటికే వర్షం దంచి కొట్టింది.ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చిరంజీవి స్టేజ్ మీదకు వెళ్లి స్పీచ్ ఇచ్చారు. అంతటి వర్షంలో కూడా కొందరు అభిమానులు చాలా ఓపిగ్గా చిరు స్పీచ్ విన్నారు.
ఇక మెగాస్టార్ కూడా వర్షంలో తడుచుకుంటూనే చాలా సుదీర్గంగా మాట్లాడారు. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు.
తాను ఎప్పుడు రాయలసీమకి వచ్చినా నేల తడుస్తుందని, ఈ రోజు కూడా వర్షం కురవడం ఒక శుభపరిణామం అని చిరంజీవి అన్నారు.ఈ మధ్య చేసిన చిత్రం కాస్త నిరాశ పరిచింది. మిమ్మల్ని సరిగ్గా అలరించలేకపోయాననే అసంతృప్తి వుంది.
గాడ్ ఫాదర్ నిశ్శబ్ద విస్పోటనం. ఈ సినిమా మిమ్మల్ని తప్పక అలరిస్తుంది. నా సినిమా రిలీజ్ రోజు నా మిత్రుడు నటించిన నాగార్జున ది ఘోస్ట్, యువ హీరో గణేష్ నటిస్తున్న స్వాతిముత్యం చిత్రాలు వస్తున్నాయి. ఈ చిత్రాలు కూడా మంచి విజయం సాధించాలి’ అని చిరంజీవి కోరారు. ఇక చివరిగా తన స్టైల్‌లో డైలాగ్ చెప్పి సందడి చేశారు.
‘ప్రతి ఒక్కరు రోడ్డు కాంట్రాక్టులు.. ఇసుక కాంట్రాక్టులు.. కొండ కాంట్రాక్టులు.. నీళ్ల కాంట్రాక్టులు.. నేల కాంట్రాక్టులు.. మద్యం కాంట్రాక్టులు అంటూ ప్రజల దగ్గర సొమ్ము తిని బలిసి కొట్టుకుంటున్నారు.
ఈ రోజు మీ ఊపిరి.. మీ గాలి కాంట్రాక్ట్ నేను తీసుకుంటున్నాను. సుపరిపాలన.. సుపరిపాలన అందివ్వాలన్న నిర్ణయం.. తప్పు చేయాలంటే భయం తప్ప మీ మనసులో ఏది ఉండకూడదు.
ఏదైనా జరగకూడదని జరిగిందో.. మీ ఊపిరి ఆగిపోతుంది.. ఖబడ్దార్’ అంటూ అదరగొట్టిన చిరు అభిమానుల చేత విజిల్స్ వేయించుకున్నాడు.